బాలీవుడ్ షెహన్‌షా

పేరు: అమితాబ్ హరివంశ్ రాయ్ బచ్చన్ జననం: 1942 అక్టోబరు 11. పుట్టింది: ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ నగరంలో ప్రతాప్ గడ్ జిల్లా, రాణీగంజ్ తాలూకా బబుపట్టి గ్రామం తల్లిదండ్రులు: హరివంశ్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్ తమ్ముడు: అజితాబ్ చదువు: షేర్ వుడ్ కళాశాల, నైనిటేల్ కిరోరిమల్ కళాశాల, ఢిల్లీ యూనివర్శిటీ జీవిత భాగస్వామి: జయాబచ్చన్ పిల్లలు:శ్వేతా నందా, అభిషేక్ బచ్చన్ నివాసం: ప్రతీక్షా, ముంబై, మహారాష్ట్ర వృత్తి: నటుడు, నిర్మాత, గాయకుడు, వ్యాఖ్యాత […]

పేరు: అమితాబ్ హరివంశ్ రాయ్ బచ్చన్
జననం: 1942 అక్టోబరు 11.
పుట్టింది: ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ నగరంలో ప్రతాప్ గడ్ జిల్లా, రాణీగంజ్ తాలూకా బబుపట్టి గ్రామం
తల్లిదండ్రులు: హరివంశ్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్
తమ్ముడు: అజితాబ్
చదువు: షేర్ వుడ్ కళాశాల, నైనిటేల్ కిరోరిమల్ కళాశాల, ఢిల్లీ యూనివర్శిటీ
జీవిత భాగస్వామి: జయాబచ్చన్
పిల్లలు:శ్వేతా నందా, అభిషేక్ బచ్చన్
నివాసం: ప్రతీక్షా, ముంబై, మహారాష్ట్ర
వృత్తి: నటుడు, నిర్మాత, గాయకుడు, వ్యాఖ్యాత
తెరంగేట్రం: సాత్ హిందుస్తానీ.
అవార్డులు: పద్మశ్రీ, పద్మ భూషన్. ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు. 15 ఫిలింఫేర్ అవార్డులు. ఫిలింఫేర్ కు అతి ఎక్కువ సార్లు (40సార్లు)నామినేట్ అయిన నటుడు. అమితాబ్ హరివంశ్ బచ్చన్ భారత సినీ నటుడు. భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటునిగా ప్రఖ్యాతి గాంచారు. అమితాబ్ ఇంటిపేరు శ్రీవాస్తవ అయినా హరివంశ్ కలం పేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా మారింది. 1970లో ఇతను జంజీర్, దీవార్ సినిమాలతో ప్రఖ్యాతి పొందాడు. తన పాత్రలతో భారతదేశపు మొదటి ‘యాంగ్రీ యంగ్ మాన్‘గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను కూడా పొందారు. నాలుగు దశాబ్దాలలో దాదాపు 180 సినిమాలలో పని చేశాడు అమితాబ్.

1970, 80లలో అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది. అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు ఫ్రాన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని ‘ఒన్ మాన్ ఇండస్ట్రీ‘గా అభివర్ణించాడు. ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. నటునిగానే కాక, నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్‌గానూ తన ప్రతిభ చాటుకున్నాడాయన. 1980లలో రాజకీయాలలో కూడా క్రీయాశీలకంగా పనిచేశాడు.

1984లో భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్ తోనూ, 2015లో పద్మవిభూషన్ తోనూ గౌరవించింది. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘లెగియన్ ఆఫ్ హానర్‘తో గౌరవించింది. హాలీవుడ్ లో మొదటిసారి 2013లో ‘ది గ్రేట్ గేట్స్బే‘ అనే సినిమాతో అడుగుపెట్టాడు బచ్చన్. జ్యియిష్ వ్యక్తి మేయర్ వోల్ఫ్ షిం అనే పాత్రలో నటించారు. 1975 బాలీవుడ్ చరిత్రలోనూ, అమితాబ్ కెరీర్ లోనూ అత్యంత భారీ హిట్లను అందించిన సంవత్సరం. ఆ సంవత్సరంలో అమితాబ్ నటించిన దీవార్, ‘షోలే’ సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ మలుపు.

Related Stories: