మళ్లీ నాదే విజయం

మనతెలంగాణ/నందిపేట: ఆర్మూర్ నియో జకవర్గంలో మళ్లీ విజయం సాధిస్తానని ని యోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాల వలన ఆర్మూర్ నియోజకవర్గంలో మళ్ళీ గులాబీ జండా ఎగురడం ఖాయమని అన్నారు. సోమవారం నందిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బూత్‌కమిటీ మెంబర్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో రూ.2400 కోట్లతో అభివృద్ధి పనులు […]

మనతెలంగాణ/నందిపేట: ఆర్మూర్ నియో జకవర్గంలో మళ్లీ విజయం సాధిస్తానని ని యోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాల వలన ఆర్మూర్ నియోజకవర్గంలో మళ్ళీ గులాబీ జండా ఎగురడం ఖాయమని అన్నారు. సోమవారం నందిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బూత్‌కమిటీ మెంబర్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో రూ.2400 కోట్లతో అభివృద్ధి పనులు చేసానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ది చేకూరిందన్నారు. లబ్ది పొందిన ప్రతి ఒక్క రు టిఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేస్తామని అంటున్నారని, దీనికి తోడు మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో తమకు కొండంత బలం చేకూరిందన్నారు. రాజకీయాలలో ఎంతో అనుభవం కలిగిన సురేష్‌రెడ్డి సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే వచ్చే ఐదేళ్ళు నియోజకవర్గ ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు.  ప్రతి కార్యకర్త గ్రామంలోని 60 మంది వద్దకు వెళ్ళి ప్రభుత్వ పనితీరు, ఆ ఇంటికి ప్రభుత్వ పథకం ద్వారా చేకూరుతున్న లబ్దిని గురించి తెలుసుకుని వారిని తమకు ఓటు వేసేలా ఒప్పించగలిగితే ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేసారు.   మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి మా ట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని కారు అభివృద్ధ్దిలో ఎంతో వేగంగా వెలుతుందన్నారు. రాష్ట్ర ఖజానా నింపడంలో కెసిఆర్‌కు ఎవరూ సాటిలేరని అన్నారు.

రాబోయే మూడేళ్లలో నందిపేట మండలం ఎంతో అభివృద్దిని సాదించబోతుందన్నారు. రూ.120 కోట్ల రూపాయలతో ఇక్కడ ఏర్పాటవుతున్న సెజ్‌లో అనేక వ్యవసాయ ఆధారిత పరిశ్రలు రానున్నాయని అన్నారు. పరిశ్రమల రాకతో ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధరలు లబించడంతో పాటు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త జీవన్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలన్నారు. ఇంటంటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను గుర్తు చేయడంతోనే వారు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్దమయితారన్న విషయాలను గర్తుంచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. జీవన్‌రెడ్డి బారీ మెజారీటీతో గెలుపొందాక ఇచ్చిన హామీల అమలుకు వెంట ఉండి పనులు చేయిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షులు నక్కల భూమేష్, మీసాల సుదర్శన్, శ్రీనివాస్‌గౌడ్, లింగం, విఠ్ఠల్‌రావ్,కోటపాటి నర్సింహనాయుడు, దత్తాద్రిగౌడ్, మోహన్‌రావ్, జగత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

TRS Candidate JeevanReddy Election Campaign

Telangana News

Related Stories: