వామపక్షాలది చెరోదారి?

 కూటమి దారిలో సిపిఐ  బహుజన లెప్ట్ ఫ్రంట్ బాటలో సిపిఎం  ఒంటరిగా బరిలోకి న్యూడెమోక్రసి  జెండాలు ఒక్కటే… ఎజెండాలే వేరు! మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఎర్ర పార్టీలు చేరో దారిలో వెళ్తున్నాయి. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ వామపక్ష పార్టీలు ప్రతి మేడే రోజు పిలుపు ఇస్తాయి. కాని ఎన్నికలు వచ్చే సరికి వారు మాత్రం కలవకుండా చేరోదారిలో వేళ్తున్నాయి.కమ్యూనిస్టులకు కంచుకోట  అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలు గతంలో బలంగా ఉండి ఇరు పార్టీలు […]

 కూటమి దారిలో సిపిఐ
 బహుజన లెప్ట్ ఫ్రంట్ బాటలో సిపిఎం
 ఒంటరిగా బరిలోకి న్యూడెమోక్రసి
 జెండాలు ఒక్కటే… ఎజెండాలే వేరు!

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఎర్ర పార్టీలు చేరో దారిలో వెళ్తున్నాయి. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ వామపక్ష పార్టీలు ప్రతి మేడే రోజు పిలుపు ఇస్తాయి. కాని ఎన్నికలు వచ్చే సరికి వారు మాత్రం కలవకుండా చేరోదారిలో వేళ్తున్నాయి.కమ్యూనిస్టులకు కంచుకోట  అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలు గతంలో బలంగా ఉండి ఇరు పార్టీలు కలిసి ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి మెజార్టీ స్ధానాలను కైవసం చేసుకునే వారు. అయితే తెలుగు దేశంపార్టీ అవిర్భవించిన తరువాత వామపక్షాలు టిడిపితో పొత్తు పెట్టుకొని  కలిసి పోటి చేసే మెజార్టీ స్ధానాల్లో ఎర్రజెండాను ఎగురవేసేవారు. కాని కాలక్రమేణి జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు బలహిన పడటంతో పాటు ఎవ్వరి దారిన వారు వెళుతున్నారు. సిద్దాంతాలు ఒక్కటైనా, జెండాలు ఒక్క టైనా, ఎజెండాలు మాత్రం వేరుగా ఉండటంతో ఎవ్వరి దారిలో వారు వేరుగా వెళ్త్తూన్నారు. కొన్ని సంద ర్బాల్లో జాతీయ పార్టీల నిర్ణయానికి భిన్నంగా కూడా వెళ్ళారు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో  కేంద్ర కమిటీ నిర్ణయాలకు భిన్నంగా వెళ్లిన సందర్బాలు కూడా ఉన్నాయి. 2009 ఎన్నికల్లో అనాడు  కాంగ్రెస్‌ను ఓడిచేందుకు టిడిపి,టి ఆర్ ఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. 2014 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పక్షానా సిపిఐ పార్టీ చేరగా  సిపిఎం పార్టీ మాత్రం వైఎస్ ఆర్‌సిపి చెంత చేరి పోటీ చేశాయి.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో కలిసి మూడు స్ధానాల్లో పోటి చేసినప్పటికి ఒక స్ధానంలో కూడా గెలువలేకపోయింది. సిపిఎం పార్టీ వైఎస్‌ఆర్ సిపితో కలిసి మూడు స్దానాల్లో పోటీచేసి కేవలం ఓక భద్రాచలంలో మాత్రమే  గెలుపొందారు. నాలుగు న్నర ఏళ్ళ అనంతరం ఇప్పుడు ఇరు పార్టీలు మళ్ళీ చేరోదారిలో వెళ్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రజా కూటమిలో సిపిఐ చేరగా, సిపిఎం పార్టీ బహుజన లెప్ట్ ఫ్రంట్ లో చేరింది.

ఈ ఎన్నికల్లో కూడా వామపక్షాలు కలువకుండా విడివిడిగా పోటీలోకి దిగుతున్నాయి. సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా,కొత్తగూడెం,పినపాక స్ధానాలను కేటాయించాలని కోరుతున్నాయి. అయితే ప్రజాకూటమి నేతలు మాత్రం ఇంకా సీట్ల సర్ధుబాటు చేయ లేదు.ఇక సిపిఎం పార్టీ మాత్రం బిఎల్‌ఎఫ్ మద్దతుతో భద్రాచలం, సత్తుపల్లి, ఆశ్వా రావుపేట, పినపాక,వైరా స్ధానాలకు ఇప్పటికే అభ్య ర్ధులను ప్రకటిం చింది.అదే విధంగా మధిరలో బిఎల్‌ఎఫ్ తరుపున పోటీ చేస్తున్న డాక్టర్ రాంబాబుకు, ఇల్లెందు లో న్యూడెమోక్రసి నుంచి  పోటీ చేస్తున్న గుమ్మడి నర్సయ్యకు సిపిఎంపార్టీ మద్దతు ప్రక టిం చింది.మిగిలిన ఖమ్మం,పాలేరు, కొత్త గూడెం  స్ధానాలకు సొంతంగా పోటీ చేయడమా లేక బిఎల్‌ఎప్ తరుపున  పోటీ చేసే అభ్యర్ధులకు మద్దతు ఇవ్వాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసు కోలేదు. ప్రజా కూటమి తరుపున అభ్యర్ధులను అధి కారికంగా ఖారారు చేసిన తరు వాత ఆయా స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించే అవ కాశం ఉంది.ఇదిలా ఉండగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  అయి దు స్దానాలకు ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ద పడింది. పినపాక,ఇల్లెందు, పాలేరు, సత్తుపల్లి,ఆశ్వారావుపేట స్ధానాలకు అభ్యర్ధులను కూడా ప్రకటించింది. ఇల్లెందులో మాజీ ఎంఎల్‌ఏ గుమ్మడి నర్సయ్య, పినపాకకు ముక్తి సత్యం, పాలేరుకు గుర్రం అచ్చయ్య, సత్తుపల్లికి కంకణాల అర్జున్‌రావు, అశ్వారావు పేటకు కంగాల కల్లయ్య పేర్లను ప్రకటించారు.అయితే న్యూడెమోక్రసికి కంచుకోట అయిన ఇల్లెందు నియోజకవర్గం 2009 ఎన్నికల్లో  నియోజకవర్గాల పునర్వీభజన తో బీటలువారగా 2014 ఎన్నికల్లో పార్టీలో తలెత్తిన  చిలీకల వల్ల తీవ్రంగా నష్టపో యింది. ఒకే పార్టీ రాయల,చంద్రన్న వర్గాలుగా వీడిపోయి పనిచేస్తున్నారు.

గత ఎన్నికల్లో చంద్రన్న, రాయల వర్గాలు వేర్వేరుగా పోటీ చేయడంతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కోరం కనకయ్య విజయం సాధించారు.ఈ స్ధానంలో ఇప్పటికి 13సార్లు ఎన్నికలు జరిగితే ఆరు పర్యాయాలు న్యూడెమోక్రసి అభ్యర్ధులే విజయం సాధించారు. ఈ ఆరు పర్యాయాల్లో అయిదు సార్లు గుమ్మడి నర్సయ్యే విజయం సాధించారు.ఇప్పుడు కూడా తిరిగి గుమ్మడి నర్సయ్య అభ్యర్ధిత్వాన్ని ఖారారు చేశారు. గత ఎన్నికల్లో న్యూడెమోక్రసిలోని రెండు వర్గాలు వేర్వేరుగా పోటీ చేయ డంతో అపజయం పొందారు.ఈ ఎన్నికల్లోనైనా కలిసి పోటీ చేసేందుకు ఇరువైపుల నుంచి ప్రయ త్నాలు జరిగినప్పటికి ఏకాభిప్రాయానికి రాలేదు.దీంతో ఈసారి కూడా ఎవ్వరికి వారే విడి విడిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాయల వర్గం అయిదు స్ధానాలకు అధికారికంగా అభ్యర్ధుల ను ప్రకటించింది.ఇక చంద్రన్న వర్గం మాత్రం ఇల్లెందు తోపాటు పినపాకకు పోటీచేయాలని నిర్ణయించింది. అయితే అభ్యర్ధులను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Related Stories: