పోలీసులు త్యాగాలు మరువలేనివి: కెసిఆర్

  హైదరాబాద్: తెలంగాణలో  ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు త్యాగాలు చేశారని సిఎం కెసిఆర్ పొగిడారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు అమరవీరుల సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం కోసం పోలీసుల ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. అమరుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 414 మంది పోలీసులు అమరులయ్యారని డిజిపి […]

 

హైదరాబాద్: తెలంగాణలో  ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు త్యాగాలు చేశారని సిఎం కెసిఆర్ పొగిడారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు అమరవీరుల సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం కోసం పోలీసుల ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. అమరుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

దేశవ్యాప్తంగా 414 మంది పోలీసులు అమరులయ్యారని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. శాంతిభద్రతల కాపాడడంలో పోలీసులు ప్రాణత్యాగాలకు వెనుకాడరని వివరించారు. పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడడంలో పోలీసులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని కొనియాడారు.

Police Commemoration Day 

Telangana news

Related Stories: