చైనా ‘డబుల్’ రికార్డు

బీజింగ్ : చైనా శనివారంనాడు రెండు రికార్డులు సృష్టించింది. అందులో ఒకటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాజు వంతెన నిర్మాణం పూర్తి చేయడం. మరొకటి ఇటు నేలపైనా, నీటిలోనూ దిగగలిగే విమానాన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయో గించడం రెండోది. సముద్రం పైన నిర్మించిన అతి పొడవైన వంతెనను ఈనెల 24న ప్రారంభించనున్నారు. చైనా- హాం కాంగ్- మకావులను కలుపుతున్న ఈ వంతెనపై ప్రజలు 24వ తేదీ నుంచి ప్రయాణించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వంతెనపై రోజూ సుమారు 29,100 […]

బీజింగ్ : చైనా శనివారంనాడు రెండు రికార్డులు సృష్టించింది. అందులో ఒకటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాజు వంతెన నిర్మాణం పూర్తి చేయడం. మరొకటి ఇటు నేలపైనా, నీటిలోనూ దిగగలిగే విమానాన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయో గించడం రెండోది. సముద్రం పైన నిర్మించిన అతి పొడవైన వంతెనను ఈనెల 24న ప్రారంభించనున్నారు. చైనా- హాం కాంగ్- మకావులను కలుపుతున్న ఈ వంతెనపై ప్రజలు 24వ తేదీ నుంచి ప్రయాణించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వంతెనపై రోజూ సుమారు 29,100 వాహనాదారులు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ నివేదిక వెల్లడిం చింది. దీని పొడవు 55 కిలోమీటర్లు, ఆరు లైన్ల రహదారితో కూడుకున్నది. 2009 డిసెంబరు నుంచి ఈ వంతెన నిర్మా ణాన్ని ప్రారంభించారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానం తొలి పరీక్ష శనివారం పూర్తయింది. నీటిలోనూ నేల మీద దిగేలా చైనా తయారు చేసిన అతి పెద్ద ఉభయచర విమానం ఏజీ600 విమానం తొలి పరీక్ష విజయవంతమైంది. శనివారం హుబే ప్రావిన్స్‌లోని జింగ్‌మెన్ ప్రాంతంలోని ఓ రిజర్వాయర్ నుంచి టేకాఫ్ అయిన విమానం 15 నిమిషాలపాటు గాలిలో తిరిగి మళ్లీ నీటిలో విజయవంతంగా దిగిందని చైనా డైలీ పత్రిక వెల్లడించింది.

Related Stories: