చెట్టును ఢీకొట్టిన బైక్: ఇద్దరి మృతి

ములకపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి  మండలపరిధిలోని కొత్త గంగారం అడవి ప్రాంతంలో చెట్టును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ములకలపల్లి ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం…. వెంకటాపురం గ్రామానికి చెందిన కాకటి సాయి (18) హమాలీ వర్కర్‌గా పనిచేస్తున్నారు. తనతోపాటు హమాలీగా పనిచేస్తున్న రాజాపురం గ్రామానికి చెందిన సున్నం వీరభద్రం (26) ఇంటివద్దకు ఎపి37డిజె2231 నెంబరు గల ద్విచక్ర వాహనంపై  దమ్మపేటలో సినిమాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం […]

ములకపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి  మండలపరిధిలోని కొత్త గంగారం అడవి ప్రాంతంలో చెట్టును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ములకలపల్లి ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం…. వెంకటాపురం గ్రామానికి చెందిన కాకటి సాయి (18) హమాలీ వర్కర్‌గా పనిచేస్తున్నారు. తనతోపాటు హమాలీగా పనిచేస్తున్న రాజాపురం గ్రామానికి చెందిన సున్నం వీరభద్రం (26) ఇంటివద్దకు ఎపి37డిజె2231 నెంబరు గల ద్విచక్ర వాహనంపై  దమ్మపేటలో సినిమాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కావడంతో ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడుపుతూ అదుపుతప్పి రోడ్డు ప్రక్కన గల చెట్టును ఢీకొట్టడం జరిగింది.

ఈ ప్రమాదంలో సాయి, వీరభద్రం ఇరువురు అక్కడికక్కడే మరణించారు. వీరభద్రం కుటుంబసభ్యులు తమ కుమారుడు ఇంటికి రాకపోవడాన్ని గమనించి సాయి కుటుంబసభ్యులను సంప్రదించారు. సాయి కూడా రాలేదనే విషయం తెలుసుకొని శుక్రవారం ఉదయం వీరభద్రం కుటుంబసభ్యులు ద్విచక్రవాహనాలపై దమ్మపేట వైపు వెతుకుతుండగా  కొత్తగంగారం అడవి ప్రాంతంలో ఇరువురు మరణించి ఉన్న విషయాన్ని కుటుంబసభ్యులు గమనించారు. ఈ విషయాన్ని వీరభద్రం తల్లి సున్నం రాఘవమ్మ ములకలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సంఘటన ప్రాంతానికి ఎస్సై ఉదయ్‌కిరణ్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించినవారిలో సాయికి ఇంకా వివాహం కాలేదు. వీరభద్రానికి భార్య, ఒక పాప ఉన్నారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. ఇరువురు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Two Members Died in Bike Accident

Telangana news

Related Stories: