‘శబరిమల వివాదం.. బాబ్రీ విధ్వంసంలాంటిదే’

హైదరాబాద్: బాబ్రీ విధ్వంసంతో శబరిమల అల్లర్లను సిపిఎం నేత సీతారాం ఏచూరి పోల్చారు. శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలపై తీవ్ర విమర్శలు చేశారు. శబరిమలలో పరిణామాలపై ఆర్‌ఎస్‌ఎస్ స్పందించాలని డిమాండ్ చేశారు. శబరిమల అల్లర్ల వెనుక ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు ఉన్నాయని ఆరోపణలు చేశారు.  శుక్రవారం ముగ్గురు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. పోలీసులు రక్షణలో ఆలయం దగ్గరికి వెళ్లారు. కానీ వారిని దర్శనం చేసుకోకుండా ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు అడ్డుకున్నాయని ఏచూరి […]

హైదరాబాద్: బాబ్రీ విధ్వంసంతో శబరిమల అల్లర్లను సిపిఎం నేత సీతారాం ఏచూరి పోల్చారు. శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలపై తీవ్ర విమర్శలు చేశారు. శబరిమలలో పరిణామాలపై ఆర్‌ఎస్‌ఎస్ స్పందించాలని డిమాండ్ చేశారు. శబరిమల అల్లర్ల వెనుక ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు ఉన్నాయని ఆరోపణలు చేశారు.  శుక్రవారం ముగ్గురు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. పోలీసులు రక్షణలో ఆలయం దగ్గరికి వెళ్లారు. కానీ వారిని దర్శనం చేసుకోకుండా ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు అడ్డుకున్నాయని ఏచూరి ధ్వజమెత్తారు. బిజెపి నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో సామాజిక సామరస్యాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.

Sabarimala Temple Updates: Yechury Comments on RSS

Telangana news

Related Stories: