ఆ డబ్బు పంపింది బాబే: ప్రకాశ్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు తెలంగాణలో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులను కూడా గెలిపించుకునేందుకు బాబు డబ్బులు పంచడం దుర్మార్గమని మండిపడ్డారు. డబ్బులు పంపింది మాత్రం చంద్రబాబే అని ఆరోపణలు చేశారు. తొలి నుంచి చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అని, ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం బాలు అలవాటు అని దుయ్యబట్టారు. డబ్బులు వెదజల్లి ఓట్లు […]

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు తెలంగాణలో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులను కూడా గెలిపించుకునేందుకు బాబు డబ్బులు పంచడం దుర్మార్గమని మండిపడ్డారు. డబ్బులు పంపింది మాత్రం చంద్రబాబే అని ఆరోపణలు చేశారు. తొలి నుంచి చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అని, ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం బాలు అలవాటు అని దుయ్యబట్టారు. డబ్బులు వెదజల్లి ఓట్లు కొనుక్కునే దుస్థితి తీసుకొచ్చిందని బాబే అని, డబ్బులతో దొరికిన అనిల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  తెలంగాణలో టిడిపికి ఒక్క సీటు వచ్చే అవకాశమే లేదని, ఆంధ్రా డబ్బులతో అధికారం చేపట్టి తెలంగాణ వారిని అమరావతి చుట్టు తిప్పుకోవాలని బాబు కుట్ర పన్నుతున్నారని తెలియజేశారు. కాంగ్రెస్‌కు సిగ్గు ఉంటే చంద్రబాబుతో జత కట్టొద్దని సూచించారు.

బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు….

డబ్బులతో ఓట్లు కొనాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన విధానాలకు తెరలేపారని ఎంపి బాల్కసుమన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు, కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Related Stories: