టెస్టు సిరీస్ పాక్ దే

అబుదాబి: ఆస్ట్రేలియా- పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ లో పాక్ ఘన విజయం సాధించింది. రెండో టెస్టులో పాక్ గెలిచి 1-0 సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా హోరాహోరీగా పోరాడి డ్రా చేసుకుంది. రెండో టెస్టులో పాక్ బౌలర్లు విజృంభించడంతో 373 పరుగుల భారీ తేడాతో ఆసీస్ ఓటమిని చవిచూసింది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 282 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. […]

అబుదాబి: ఆస్ట్రేలియా- పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ లో పాక్ ఘన విజయం సాధించింది. రెండో టెస్టులో పాక్ గెలిచి 1-0 సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా హోరాహోరీగా పోరాడి డ్రా చేసుకుంది. రెండో టెస్టులో పాక్ బౌలర్లు విజృంభించడంతో 373 పరుగుల భారీ తేడాతో ఆసీస్ ఓటమిని చవిచూసింది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 282 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులు చేసి ఆలౌటైంది. సీమర్ మహ్మద్ అబ్బాస్ అద్భుతంగా రాణించి రెండో టెస్టులో పది వికెట్లు(5-33, 5-62) తీశాడు. ఈ సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు అబ్బాస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లు వరించాయి. పాక్ కు ఇదే అతిపెద్ద విజయం కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో ఐసిసి ర్యాంకింగ్స్ లో మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది.

Pak vs Aus: Pakistan won Test Series

Telangana news

Related Stories: