ఇలాంటి రనౌట్ ఎప్పుడైనా చూశారా… (వీడియో)

దుబాయ్: పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ రనౌట్  చూసి  అందరూ తెగనవ్వుకుంటున్నారు.  అసలు క్రికెట్ చరిత్రలో ఇలాగా ఎవరైనా రనౌట్ అవుతారా అని ముక్కునా వేలేసుకుంటున్నారు. పాక్ బ్యాట్స్ మెన్  అజర్ అలీ రనౌటైన తీరును చూసి క్రికెట్ అభిమానులు జోకులు వేసుకుంటున్నారు. అజర్ అలీ ఓ బంతిని థర్డ్ మ్యాన్ వైపు మళ్లించాడు. కానీ అతివేగంతో బౌండరీ వైపుకు వెళ్లింది. కానీ బౌండరీకి మీటర్ దూరంలో ఆగిపోయింది. అజల్ అలీ మాత్రం […]

దుబాయ్: పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ రనౌట్  చూసి  అందరూ తెగనవ్వుకుంటున్నారు.  అసలు క్రికెట్ చరిత్రలో ఇలాగా ఎవరైనా రనౌట్ అవుతారా అని ముక్కునా వేలేసుకుంటున్నారు. పాక్ బ్యాట్స్ మెన్  అజర్ అలీ రనౌటైన తీరును చూసి క్రికెట్ అభిమానులు జోకులు వేసుకుంటున్నారు. అజర్ అలీ ఓ బంతిని థర్డ్ మ్యాన్ వైపు మళ్లించాడు. కానీ అతివేగంతో బౌండరీ వైపుకు వెళ్లింది. కానీ బౌండరీకి మీటర్ దూరంలో ఆగిపోయింది. అజల్ అలీ మాత్రం బంతి బౌండరీ వైపు వెళ్లిందని, పీచ్ మధ్యలోకి వచ్చి నాన్ స్ట్రైకర్  బ్యాట్స్ మెన్ తో ముచ్చటిస్తున్నాడు.  మిచెల్ స్టార్క్ బంతిని అందుకొని కీపర్ కు విసిరాడు. కీపర్ వికెట్లను బంతితో కొట్టడంతో అజర్ అలీ తెల్లమొహం వేశాడు.  బంతి బౌండరీ దగ్గరకు వెళ్లిందో లేదో చూడని అలీపై క్రికెట్ అభిమానులు తనదైనశైలిలో చురకలంటిస్తున్నారు. ఈ ఘటన చూసి పాకిస్తాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ కొంచె సేపు ఖంగుతిన్నాడు.

Funny Run Out in Cricket History in PAK vs AUS

Telangana news

Related Stories: