సుంకేసుల డ్యాంలో దూకి వ్యక్తి ఆత్మహత్య

రాజోళిః జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల శివారుల్లో ఉన్నటు వంటి సుంకేసుల డ్యాంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ముత్యాల రాంమ్మూర్తి తెలిపిన వివరాల మేరకు.. రాజోళి గ్రామానికి చెందిన ముల్లా ఫరుక్ (30) అనే యువకుడు చిరువ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు ఏళ్ళుగా పిల్లలు కాకపోవడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉండటంతో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో తుంగభద్ర శివారుల్లోని సుంకేసుల […]


రాజోళిః జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల శివారుల్లో ఉన్నటు వంటి సుంకేసుల డ్యాంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ముత్యాల రాంమ్మూర్తి తెలిపిన వివరాల మేరకు.. రాజోళి గ్రామానికి చెందిన ముల్లా ఫరుక్ (30) అనే యువకుడు చిరువ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు ఏళ్ళుగా పిల్లలు కాకపోవడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉండటంతో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో తుంగభద్ర శివారుల్లోని సుంకేసుల డ్యాంలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళడంతో స్పందించిన అధికారులు వెంటనే డ్యాం పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం చీకటి పడే సమయం వరకు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినా లభ్యం కాకపోవడంతో గురువారం తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మృతదేహాం లభ్యమయ్యాక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు వారు తెలిపారు.

Related Stories: