డ్రైనేజ్ పడి వ్యక్తి మృతి

బోరబండ: వరద నీటిలో కొట్టుకొని పోయి వ్యక్తి మృతి చెందిన సంఘటన బోరబండలో బుధవారం చోటు చేసుకుంది. డిప్యూటి మేయర్ తెలిపిన వివరాల ప్రకారం… మూసాపేట్ రామారావు నగర్‌కు చెందిన రాజయ్య నగరంలో భారీ వర్షానికి వరద నీరు పోటెత్తడంతో బోరబండ సాయిబాబా ఆలయంవద్ద ప్రమాద వశాత్తు డ్రైనేజ్ నాలాలో పడి పోయి మృతి చెందాడు. గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ హుటా హుటిన సంఘటన స్థలానికి జిహెచ్‌ఎంసి రెస్కూ టీం సభ్యులతో చేరుకుని నాలాలో పడిపోయిన వ్యక్తిని […]

బోరబండ: వరద నీటిలో కొట్టుకొని పోయి వ్యక్తి మృతి చెందిన సంఘటన బోరబండలో బుధవారం చోటు చేసుకుంది. డిప్యూటి మేయర్ తెలిపిన వివరాల ప్రకారం… మూసాపేట్ రామారావు నగర్‌కు చెందిన రాజయ్య నగరంలో భారీ వర్షానికి వరద నీరు పోటెత్తడంతో బోరబండ సాయిబాబా ఆలయంవద్ద ప్రమాద వశాత్తు డ్రైనేజ్ నాలాలో పడి పోయి మృతి చెందాడు. గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ హుటా హుటిన సంఘటన స్థలానికి జిహెచ్‌ఎంసి రెస్కూ టీం సభ్యులతో చేరుకుని నాలాలో పడిపోయిన వ్యక్తిని బయటకు తీశారు. డ్రైనేజ్ నీటిలో పడిపోవడంతో ఊపిరి ఆడక రాజయ్య మృతి చెందాడు.

Man dies after falling into open drainage

Telangana news

Related Stories: