రాజ్‌భవన్‌లో దుర్గాష్టమి పూజ…

హైదరాబాద్: బుధవారం దుర్గాష్టమి సందర్భంగా రాజ్‌భవన్‌లో దుర్గాష్టమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  గవర్నర్ నరసింహన్, అధికారులు పాల్గొన్నారు. దుర్గాష్టమిని దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాష్టమి. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు […]

హైదరాబాద్: బుధవారం దుర్గాష్టమి సందర్భంగా రాజ్‌భవన్‌లో దుర్గాష్టమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  గవర్నర్ నరసింహన్, అధికారులు పాల్గొన్నారు. దుర్గాష్టమిని దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాష్టమి. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెబుతున్నారు. అయితే మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవి పూజించలేని భక్తులు దుర్గాష్టమి, విజయదశమి నాడు పూజ చేస్తే అష్టైశ్వర్యాలు, సుఖజీవనం వంటి శుభఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం.

Related Stories: