తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలి:మావోయిస్టులు

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు బుధవారం ఓ లేఖను విడుదల చేశారు.  మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ పేరిట లేఖ విడుదలైంది. ఈ లేఖలో రాజాకీయ పార్టీల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అధికార తెరాస గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి కెెసిఆర్ ఎన్నికలకు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, తెదేపా చేసిందేమీ లేదని,మహాకూటమి […]

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు బుధవారం ఓ లేఖను విడుదల చేశారు.  మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ పేరిట లేఖ విడుదలైంది. ఈ లేఖలో రాజాకీయ పార్టీల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అధికార తెరాస గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి కెెసిఆర్ ఎన్నికలకు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, తెదేపా చేసిందేమీ లేదని,మహాకూటమి పేరుతో సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కాంగ్రెస్, తెదేపాతో జట్టు కట్టడం బూర్జువా పార్టీలకు ఓట్లు సంపాదించి పెట్టడమేనని విమర్శించారు. ముందస్తు ఎన్నికలను బహిష్కరించి ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలని ఆయన లేఖలో కొరారు

Related Stories: