#Me Too ఎఫెక్ట్: కేంద్ర మంత్రి రాజీనామా..

న్యూఢిల్లీ: #Me Too ఉద్యమంలో భాగంగా పలువురు మహిళా జర్నలిస్టుల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. విదేశాంగ శాఖ కార్యాలయంలో తన రాజీనామాను సమర్పించినట్లు ఆయన చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశాన్ని తాను కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నానని,  ఈ పోరాటాన్ని ఓ సాధారణ వ్యక్తిగానే కొనసాగిస్తానని.. అందుకే […]

న్యూఢిల్లీ: #Me Too ఉద్యమంలో భాగంగా పలువురు మహిళా జర్నలిస్టుల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. విదేశాంగ శాఖ కార్యాలయంలో తన రాజీనామాను సమర్పించినట్లు ఆయన చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశాన్ని తాను కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నానని,  ఈ పోరాటాన్ని ఓ సాధారణ వ్యక్తిగానే కొనసాగిస్తానని.. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. తనపై జర్నలిస్టు ప్రియా రమణి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తన ప్రతిష్టను మసకబార్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన  విమర్శించారు. అక్బర్‌ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన జర్నలిస్టులకు లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

 

Central minister MJ Akbar resigned his post 

Related Stories: