పోలీసుల త్యాగాలు మరువలేనివి..!

తంగళ్లపల్లి: ప్రజల రక్షణలో పోలీసుల త్యాగాలు మరువలేనివని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి రాహుల్ హేగ్డే అన్నారు. బుధవారం మండలంలోని తాడూర్‌లో గల పోలీస్ హెడ్ క్వాటర్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పోలీస్ అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా పలువురు పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం ఎస్పి రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలు స్వేచ్చగా జీవిస్తున్నారంటే దానికి కారణం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమర వీరులదే అన్నారు. శాంతి […]


తంగళ్లపల్లి: ప్రజల రక్షణలో పోలీసుల త్యాగాలు మరువలేనివని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి రాహుల్ హేగ్డే అన్నారు. బుధవారం మండలంలోని తాడూర్‌లో గల పోలీస్ హెడ్ క్వాటర్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పోలీస్ అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా పలువురు పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం ఎస్పి రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలు స్వేచ్చగా జీవిస్తున్నారంటే దానికి కారణం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమర వీరులదే అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా పోలీసులు 24గంటలు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అందులో ఎంతో మంది పోలీసులు ప్రజల కోసం అమరులవుతున్నారని వారందరిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రక్తదానం చేయడమంటే ఇంకొకరికి ప్రాణదానం చేయడమేనన్నారు. రక్తదాన శిబిరంలోని పోలీసులను ఎస్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ అనిల్ కుమార్,టౌన్ సిఐ శ్రీనివాస్, 17 వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పిసి రమణ,జెఎ బి.శ్రీనివాస్,ఆర్‌ఐ సుధాకర్ రెడ్డి,ఎఆర్‌ఐలు లింగమూర్తి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories: