నేల రాలిన ‘తెల్ల బంగారం’

ఝరాసంగం: మండలంలోని ఆయా గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి చేతికి అందివస్తున్న పత్తి పంట (తెల్లబంగారం) నేలపాయింది. బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కురిసిన వర్షంతో మండలంలోని జీర్లపల్లి, చీలమామిడి, జోనేగావ్, ఇస్లాంపూర్, ఏడాకులపల్లి, బోరేగావ్, బోప్పన్‌పల్లి, గుంతమర్పల్లి తదితర గ్రామాల్లో రైతులు పండిస్తున్న పత్తి పంట నేలపాలయింది. పంట సాగుచేసిన తొలి నాళ్లలో అతివృష్టితో పంట పండక రైతులు అష్టకష్టాలు పడగా, చేతికి అంది వస్తున్న తరుణంలో అతివర్షంతో నేలపాలు కావడంతో రైతులు […]


ఝరాసంగం: మండలంలోని ఆయా గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి చేతికి అందివస్తున్న పత్తి పంట (తెల్లబంగారం) నేలపాయింది. బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కురిసిన వర్షంతో మండలంలోని జీర్లపల్లి, చీలమామిడి, జోనేగావ్, ఇస్లాంపూర్, ఏడాకులపల్లి, బోరేగావ్, బోప్పన్‌పల్లి, గుంతమర్పల్లి తదితర గ్రామాల్లో రైతులు పండిస్తున్న పత్తి పంట నేలపాలయింది. పంట సాగుచేసిన తొలి నాళ్లలో అతివృష్టితో పంట పండక రైతులు అష్టకష్టాలు పడగా, చేతికి అంది వస్తున్న తరుణంలో అతివర్షంతో నేలపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.చేసినఅప్పులు ఇక తీర్చుకోవచ్చనుకుంటున్న తరుణంలో తెల్లబంగారం నేలపావుకావడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉన్నతాధికారులు స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని వినతి చేస్తున్నారు.

Related Stories: