‘అంతరిక్షం’ టీజర్ వచ్చేసింది..(వీడియో)

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,  ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘అంతరిక్షం’.9000 కెఎంపిహెచ్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో వరుణ్ సరసన  అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర  షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా లో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రంలోని సన్నివేశాలను […]

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,  ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘అంతరిక్షం’.9000 కెఎంపిహెచ్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో వరుణ్ సరసన  అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర  షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా లో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రంలోని సన్నివేశాలను జీరో గ్రావిటీ సెట్స్‌ పై చిత్రీకరించడం విశేషం. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ విశేషంగా ఆకట్టుకుంది. దసరా కానుకగా బుధవారం ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. కేవలం 57 సెకనుల నిడివితో విడుదలైన ఈ టీజర్ లోని సన్నివేశాలు సినిమాపై ఉత్కంఠను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పై క్రియేటీవ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

Related Stories: