రాజస్థాన్‌లో బిజెపికి షాక్

ఢిల్లీ : రాజస్థాన్‌లో బిజెపికి గట్టి షాక్ తగిలింది. బిజెపి అగ్రనేత జశ్వంత్ సింగ్ తనయుడు మానవేంద్ర సింగ్ బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఉదయం ఆయన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మానవేంద్రసింగ్ మీడియాతో మాట్లాడారు. తన అనుచరులు, మద్ధతుదారులు తనకు మద్ధతిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. గత నెలలో బర్మార్‌లో స్వాభిమాన్ […]

ఢిల్లీ : రాజస్థాన్‌లో బిజెపికి గట్టి షాక్ తగిలింది. బిజెపి అగ్రనేత జశ్వంత్ సింగ్ తనయుడు మానవేంద్ర సింగ్ బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఉదయం ఆయన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మానవేంద్రసింగ్ మీడియాతో మాట్లాడారు. తన అనుచరులు, మద్ధతుదారులు తనకు మద్ధతిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. గత నెలలో బర్మార్‌లో స్వాభిమాన్ పేరుతో ఆయన ర్యాలీ తీశారు. తాను బిజెపి నుంచి వైదొలగనున్నట్టు నాడు ఆయన ప్రకటించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మానవేంద్ర సింగ్ బిజెపిని వీడడం, ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Shock to BJP in Rajasthan

Related Stories: