ఉద్యోగులు, టీచర్లకు ఐఆర్ ఆందోళన వద్దు

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐఆర్ (మధ్యంతర భృతి) గురించి ఆందోళన అవసరం లేదని, సముచితమైన రీతిలో పెంచుతామని కెసిఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిమ్మలంగా ఉండవచ్చునని అన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే అన్నీ అమలవుతాయని, ప్రతీ ఐదేళ్ళకోసారి ఇది క్రమం తప్పకుండా జరగాల్సిన ప్రక్రియేనని అన్నారు. కాంగ్రెస్ హామీలు గాలి మాటలు గతంలో (2009లో) ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకుండా పోయాయని గుర్తుచేసిన కెసిఆర్ పింఛనను […]

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐఆర్ (మధ్యంతర భృతి) గురించి ఆందోళన అవసరం లేదని, సముచితమైన రీతిలో పెంచుతామని కెసిఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిమ్మలంగా ఉండవచ్చునని అన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే అన్నీ అమలవుతాయని, ప్రతీ ఐదేళ్ళకోసారి ఇది క్రమం తప్పకుండా జరగాల్సిన ప్రక్రియేనని అన్నారు.
కాంగ్రెస్ హామీలు గాలి మాటలు
గతంలో (2009లో) ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకుండా పోయాయని గుర్తుచేసిన కెసిఆర్ పింఛనను రూ. 225కు పెంచుతామని హామీ ఇచ్చినా రూ. 25 దిగమింగిందని ఆరోపించారు. తండాలను పంచాయతీలు చేస్తామని హామీ ఇచ్చి మరిచిందని, వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా అని మర్చిపోయిందని, ఆరు కిలోల బియ్యం సరఫరా అని చెప్పి మాట తప్పిందని, వంట గ్యాస్ ధరను సగానికి తగ్గిస్తామని చెప్పి రూ. 261 నుంచి రూ. 479కి పెంచిందని& ఇలాంటి చేదు అనుభవాలన్నీ ప్రజలకు తెలుసని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ‘క్రెడిబిలిటీ’ ప్రభుత్వంగా గుర్తింపు పొందిందన్నారు.
ప్రతీ రెండు నియోజకవర్గాలకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల ద్వారా ఉపాధి, మేలు కలిగించే ఉద్దేశంతో ప్రతీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పనున్నామని కెసిఆర్ హామీ ఇచ్చారు. ఇందిరా క్రాంతి పథం కింద మహిళా గ్రూపులకు ప్రత్యేక సబ్సిడీని ఇచ్చి వాటి ద్వారానే అమలుచేస్తామని స్పష్టం చేశారు. దేశంలో మరే రాష్ట్రం కంటే తెలంగాణలో మహిళా గ్రూపులు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయంటూ బ్యాంకర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, వారికి రుణాలు ఇస్తే సకాలంలో చెల్లించడంతో పాటు 99.9% వసూలవుతున్నాయని వ్యాఖ్యానించారని, మళ్ళీ రుణాలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ఆ బ్యాంకర్లు ముందుకొస్తున్నారని కెసిఆర్ వివరించారు. ఈ పరిస్థితి కారణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనలో మహిళా గ్రూపులను భాగస్వాములను చేస్తామన్నారు.
పాపడ్ పథకం ఆదర్శం
ముంబాయి నగరంలో ధారవి అనే మురికివాడ ప్రాంతంలో ఒక స్వచ్ఛంద సంస్థ ప్రణాళిక ప్రకారం పనులు మొదలుపెట్టి పాపడ్‌ల తయారీ దిశగా కార్యాచరణను ప్రారంభించిందని, అది ముంబయి నగరానికి విస్తరించి ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఏటా రూ. 1100 కోట్ల టర్నోవర్ దిశగా ఫలితాలు సాధించిందని కెసిఆర్ గుర్తుచేశారు. ఈ సంస్థ తయారుచేస్తున్న పాపడ్‌లు ఇప్పుడు అనేక స్టార్ హోటళ్ళలో కూడా వినియోగమవుతున్నాయని గుర్తుచేశారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సైతం మహిళా గ్రూపుల ద్వారా నెలకొల్పాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు అనుబంధ ఉత్పత్తుల ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు.

Related Stories: