చెప్పుతో కొట్టి.. కర్రతో చితకబాదింది

అసభ్యంగా ప్రవర్తించిన బ్యాంకు మేనేజర్‌కు మహిళ దేహశుద్ధి దావణగెరె :  తనతో అసభ్యంగా ప్రవర్తించిన బ్యాంకు మేనేజర్‌ కు ఓ మహిళ దేహశుద్ధి చేసింది. తన కోరిక తీరిస్తేనే రుణం మంజూరు చేస్తానన్న అతడిని గల్లపట్టి నడిరోడ్డుపైకి గుంజుకొచ్చింది. అందరూ చూస్తుండగానే చెప్పుతో కాసేపు… కర్రతో ఇంకాసేపు చితక్కొట్టింది.  కర్నాటకలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే దావణగెరె ప్రాంతానికి చెందిన ఓ మహిళ రుణం నిమిత్తం స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. రుణం కావాలని అడిగితే […]

అసభ్యంగా ప్రవర్తించిన
బ్యాంకు మేనేజర్‌కు మహిళ దేహశుద్ధి

దావణగెరె :  తనతో అసభ్యంగా ప్రవర్తించిన బ్యాంకు మేనేజర్‌ కు ఓ మహిళ దేహశుద్ధి చేసింది. తన కోరిక తీరిస్తేనే రుణం మంజూరు చేస్తానన్న అతడిని గల్లపట్టి నడిరోడ్డుపైకి గుంజుకొచ్చింది. అందరూ చూస్తుండగానే చెప్పుతో కాసేపు… కర్రతో ఇంకాసేపు చితక్కొట్టింది.  కర్నాటకలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే దావణగెరె ప్రాంతానికి చెందిన ఓ మహిళ రుణం నిమిత్తం స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. రుణం కావాలని అడిగితే అక్కడి మేనేజర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుణం మంజూరు చేసే విషయం గురించి మాట్లాడటానికి తన ఇంటికి రమ్మన్నాడు. సరేనని చెప్పిన ఆ మహిళ అతని ఇంటికి వెళ్లింది. తన కోరిక తీరిస్తేనే  రుణం ఇస్తానని షరతు విధించాడు. దాంతో ఆమెకు చిర్రెత్తిన ఆమె మేనేజర్‌ను ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకొచ్చి చెప్పులు, కర్రతో చావబాదింది. స్థానిక మీ డియా వర్గాలు అక్కడికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేస్తున్న ఆ దృశ్యాన్ని వీడియో తీశాయి. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడు ఓ బ్యాంకు శాఖలో మేనేజర్ అని తెలిసింది. నిజలింగప్ప అనే ప్రాం తంలో ఆయన ఉంటున్నాడు. ఆ ఏరియాలోనే మహిళ కూడా నివసిస్తోంది.

Related Stories: