తుపాకీతో మాజీ ఎంపి కొడుకు వీరంగం

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మాజీ ఎంపి కుమారుడు ఒకరు తుపాకీతో మహిళను బెదిరిస్తూ వీరంగం సృష్టించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని ప్రవర్తన పట్ల నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వద్ద బిఎస్‌పి మాజీ ఎంపి రాకేశ్ పాండే కుమారుడు  ఆశిష్ పాండే తుపాకీతో ఓ జంట పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు, ఆశిష్‌తో ఉన్న మరో మహిళ అతడ్ని వారించడానికిప్రయత్నించగా ఆశిష్ […]

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మాజీ ఎంపి కుమారుడు ఒకరు తుపాకీతో మహిళను బెదిరిస్తూ వీరంగం సృష్టించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని ప్రవర్తన పట్ల నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వద్ద బిఎస్‌పి మాజీ ఎంపి రాకేశ్ పాండే కుమారుడు  ఆశిష్ పాండే తుపాకీతో ఓ జంట పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు, ఆశిష్‌తో ఉన్న మరో మహిళ అతడ్ని వారించడానికిప్రయత్నించగా ఆశిష్ ఆమెను కూడా బెదిరిస్తూ, తిడుతూఉండడంతో హోటల్ సిబ్బంది వారిని అక్కడినుంచి పంపించి వేయడానికి ప్రయత్నించారు. ఇదంతా వీడియోలో రికార్డు అయింది. ఆదివారం రాత్రి పార్టీ ముగిసిన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆర్‌కె పురంలోని పార్క్ హయాత్ హోటల్ అసిస్టెంట్ మేనేజర్ సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఆయుధ చట్టం కింద ఆశిష్‌పై కేసు నమోదు చేశామని, త్వరలోనే అతడ్ని అరెస్టు చేస్తామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Related Stories: