‘స‌వ్య‌సాచి’ నుండి మేలోడి సాంగ్..

అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్య, చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స‌వ్య‌సాచి’. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి,  నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్నఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతు న్న ఈ చిత్రంలో చైతూ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో చైతూ త‌న రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ని, ప్ర‌త్య‌ర్ధుల‌ని […]

అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్య, చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స‌వ్య‌సాచి’. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి,  నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్నఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతు న్న ఈ చిత్రంలో చైతూ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో చైతూ త‌న రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ని, ప్ర‌త్య‌ర్ధుల‌ని ఎదుర్కొంటాడు అని చూపించ‌నున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ  చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌, వెన్నెల కిషోర్‌, సత్య, రావు రమేష్‌, తాగుబోతు రమేష్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవ‌ల విడుద‌ల ఈ చిత్ర టీజ‌ర్,  వైనాట్ అనే తొలి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  తాజాగా ఈ చిత్రంలోని  ఒక్క‌రంటే ఒక్క‌రు అనే మెలోడి సాంగ్ విడుద‌ల చేశారు. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రాని ఓ సరికొత్త కథాంశంతో  ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రయూనిట్  ప్లాన్ చేస్తుంది.

Melodi song release from Savyasachi movie

Related Stories: