రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

  మేడ్చల్ : రోడ్డు ప్రమాదంలో  యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటకు చెందిన అల్లెపు అశోక్(25) జీవనోపాధి నిమిత్తం కుటుంబంతో సహా వచ్చి మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని అత్వెల్లిలో నివాసముంటున్నాడు. ఓ ప్రయివేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనం (ఏపి16ఆర్8062)కు మరమ్మతులు చేయించడానికి మేడ్చల్‌కు వచ్చాడు. […]

 

మేడ్చల్ : రోడ్డు ప్రమాదంలో  యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటకు చెందిన అల్లెపు అశోక్(25) జీవనోపాధి నిమిత్తం కుటుంబంతో సహా వచ్చి మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని అత్వెల్లిలో నివాసముంటున్నాడు. ఓ ప్రయివేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనం (ఏపి16ఆర్8062)కు మరమ్మతులు చేయించడానికి మేడ్చల్‌కు వచ్చాడు. మరమ్మతులు చేయించుకొని తిరిగి వెళ్తుండగా పట్టణంలోని జాతీయ రహదారి పై బావర్చి హోటల్ సమీపంలో అతి వేగంగా వచ్చి లారీ (ఏపి03టీఈ6948) వెనుకనుండి ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన అశోక్ తల పైనుండి లారీ చక్రం వెళ్లడంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాయుడు తెలిపారు.

young man died in road accident

Related Stories: