రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ

నిరుద్యోగ భృతి కింద రూ.3,016 అందజేస్తాం రైతు బంధు పథకంలో ఎకరాకు రూ.1000 పెంచుతాం హైదరాబాద్: రైతు బంధు పథకంలో ఎకరాకు రూ.1000 పెంచుతామని, పంటకు రూ.5 వేలు చొప్పున రెండు పంటలకు కలిపి రూ.10 వేలు అందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసిన అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని సిఎం వెల్లడించారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలను ప్రజలకు చెబుతామన్నారు. […]

నిరుద్యోగ భృతి కింద రూ.3,016 అందజేస్తాం

రైతు బంధు పథకంలో ఎకరాకు రూ.1000 పెంచుతాం

హైదరాబాద్: రైతు బంధు పథకంలో ఎకరాకు రూ.1000 పెంచుతామని, పంటకు రూ.5 వేలు చొప్పున రెండు పంటలకు కలిపి రూ.10 వేలు అందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసిన అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని సిఎం వెల్లడించారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలను ప్రజలకు చెబుతామన్నారు. విభజన సమయంలో సమస్యలు చాలా ఉండేవని, విద్యుత్, తాగునీరు, సాగునీరు వంటి సమస్యలుండేవని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు అయోమయ పరిస్థితిలో ఉన్నామని, ఏడాది తర్వాత గానీ.. కల్యాణలక్ష్మీ పథకంపై ఓ అవగాహనకు రాలేదని చెప్పారు. ఇపుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంపూర్ణ అవగాహన ఉందని తెలిపారు. నిరుద్యోగ భృతి చాలా కఠిన సమస్య అని, నిరుద్యోగ భృతి కింద రూ.3,016 అందజేస్తామన్నారు. ఇక 57 సంవత్సరాలకే ఆసరా పింఛన్ ను వర్తింపజేస్తామని, పింఛన్ ను రూ.2,016 పెంచుతున్నామని వెల్లడించారు. అలాగే దివ్యాంగుల పింఛన్ కూడా రూ.3,016 పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతోపాటు కల్యాణలక్ష్మీ పథకాన్ని క్రమక్రమంగా అన్ని వర్గాలకు విస్తరింపజేసి సాయాన్ని పెంచుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పక్కా ఇండ్లు నిర్మించారని, పక్కా ఇండ్ల నిర్మాణాల్లో కుంభకోణాలు జరిగాయన్నారు. గృహ రుణాలు రూ.4,136 కోట్లు రద్దు చేసినట్లు సిఎం చెప్పారు. టిఆర్ఎస్ పార్టీకి నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయని వివరించారు. వచ్చే ఐదేళ్లలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని, వచ్చే ఐదేళ్లలో తెలంగాణకు సమకూరే ఆదాయాన్ని బట్టే పథకాలు ఉంటాయన్నారు. చెప్పింది తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నాలుగేళ్లలో కేంద్రం నుంచి అదనంగా నయా పైసా కూడా రాలేదని సిఎం ఆరోపించారు.

 
 CM KCR press meet at Telangana bhavan

Related Stories: