తాటిపల్లిలో డిగ్రీ విద్యార్థి హత్య

జగిత్యాల : జగిత్యాల జిల్లా తాటిపల్లిలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. అప్పటి వరకు గ్రామంలో బతుకమ్మ సంబురాల్లో మునిగి తేలిన ఓ డిగ్రీ విద్యార్థి స్నేహితుడి చేతిలో హత్యకు గురైనట్లు తెలియగానే గ్రామంలో కలకలం రేగింది. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాదినేని నవీన్, బొలిశెట్టి శ్రవణ్‌లు జగిత్యాలలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. […]

జగిత్యాల : జగిత్యాల జిల్లా తాటిపల్లిలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. అప్పటి వరకు గ్రామంలో బతుకమ్మ సంబురాల్లో మునిగి తేలిన ఓ డిగ్రీ విద్యార్థి స్నేహితుడి చేతిలో హత్యకు గురైనట్లు తెలియగానే గ్రామంలో కలకలం రేగింది. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాదినేని నవీన్, బొలిశెట్టి శ్రవణ్‌లు జగిత్యాలలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. బతుకమ్మ సంబురాల్లో భాగంగా సోమవారం రాత్రి గ్రామంలో యువకులంతా కలిసి కోలలు ఆడారు. కోలలు ఆడిన తర్వాత యువకులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోతుండగా సాదినేని నవీన్‌ను అతడి స్నేహితుడు బొలిశెట్టి శ్రవణ్ ఇక్కడి వరకు వెళ్లి వద్దామంటూ గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న శ్రవణ్ నవీన్‌తో ఘర్షకు దిగినట్లు తెలుస్తోంది. శ్రవణ్ తనతో గొడవ పడుతున్నాడని నవీన్ ఫోన్‌లో తన కుటుంబ సభ్యులకు తెలుపగా వారు వెంటనే నవీన్ సూచించిన ప్రాంతానికి చేరుకున్నారు.

అయితే వారు వెళ్లే సరికి నవీన్ అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటంతో వెంటనే అతడిని గ్రామంలోని ఆర్‌ఎంపి వద్దకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని వెంటనే జగిత్యాలకు తరలించాలని సూచించారు. దాంతో నవీన్‌ను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రి నిర్వహకులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. నవీన్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. నవీన్ చాతిపై కత్తి గాటు ఉందని, ప్రేమ వ్యవహరం నేపథ్యంలోనే శ్రవణ్ నవీన్‌తో ఘర్షణకు దిగి హతమార్చి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల డిఎస్‌పి వెంకటరమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, విచారణ ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Degree student Murder

Related Stories: