‘వీర భోగ వసంత రాయలు’ ట్రైలర్ రిలీజ్(వీడియో)

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు,  శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. దేశంలోని మత విధానాలకు సంబంధించిన చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలస్తుంది. ఈ చిత్రానికి ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్నాడు. బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెళ్లన నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు. ‘వస్తువులు పోవడం గురించి వినుంటాం, చివరికి […]

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు,  శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. దేశంలోని మత విధానాలకు సంబంధించిన చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలస్తుంది. ఈ చిత్రానికి ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్నాడు. బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెళ్లన నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు. ‘వస్తువులు పోవడం గురించి వినుంటాం, చివరికి మనుషులు పోవడం గురించి కూడా వినుంటాం. కానీ ఇల్లు పోవడం ఏంట్రా?’ అని పోలీసు అధికారి అయిన సుధీర్‌బాబు ఓ చిన్న కుర్రాడిని ప్రశ్నిస్తాడు. ‘నిజంగానే మా ఇల్లు తప్పిపోయింది సర్‌’ అని ఆ కుర్రాడు చెప్తాడు. పోలీస్‌ కానిస్టేబుల్‌ అయిన శ్రీనివాస్‌రెడ్డి ఆ కుర్రాడు చెప్పిన ప్రదేశానికి వెళ్తాడు. నిజంగానే ఇల్లు తప్పిపోయిందని చెప్తాడు. ఇందుకు సుధీర్‌బాబు..‘ఇలాంటి అద్భుతాన్ని వినడం కంటే చూస్తే ఇంకా బాగుంటుంది కదా..’ అనడం సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ‘మిస్సవుతున్న వాళ్లల్లో చాలా మంది అమ్మాయిలే ఉన్నారు. వాళ్లల్లో కొందరు అనాథలైతే మరికొందరు పేదలు. ఎందుకంటే వారి గురించి ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి’ అని ప్రముఖ నటుడు శశాంక్‌ చెప్తున్న డైలాగ్‌ హృదయం ద్రవింపజేసేలా ఉంది. ఇందులో నారా రోహిత్‌, శ్రియ సిబిఐ అధికారులుగా కన్పించనున్నారు. అక్టోబర్‌ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

veera bhoga vasantha rayalu trailer release

Related Stories: