నీళ్ల తొణికిసలాటలో కాకతీయ కెనాల్

  కాలువలోకి వస్తున్న 3500 క్యూసెక్కుల నీరు  ఆనందంలో రైతన్నలు మన తెలంగాణ/ హుజూరాబాద్: గత ప్రభుత్వాలు చేయలేని పనిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి నిరూపిస్తున్నది. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చేసి చూపిస్తామన్నది వాస్తవరూపం దాల్చింది. లోయర్ మానేరు డ్యాం(ఎల్‌ఎండి)కింద 7లక్షల 48వేల ఎకరాలకు సాగు నీరందించడమే ప్రధాన ఉద్దేశం. కాలువ శిథిలావస్థకు చేరుకున్నా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చివరి ఆయకట్టు కు నీళ్లు పారలేదు. అప్పటి పాలకుల నిర్లక్షంతో ఏనాడు సమృద్ధిగా నీళ్లు […]

 

కాలువలోకి వస్తున్న 3500 క్యూసెక్కుల నీరు
 ఆనందంలో రైతన్నలు
మన తెలంగాణ/ హుజూరాబాద్: గత ప్రభుత్వాలు చేయలేని పనిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి నిరూపిస్తున్నది. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చేసి చూపిస్తామన్నది వాస్తవరూపం దాల్చింది. లోయర్ మానేరు డ్యాం(ఎల్‌ఎండి)కింద 7లక్షల 48వేల ఎకరాలకు సాగు నీరందించడమే ప్రధాన ఉద్దేశం. కాలువ శిథిలావస్థకు చేరుకున్నా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చివరి ఆయకట్టు కు నీళ్లు పారలేదు. అప్పటి పాలకుల నిర్లక్షంతో ఏనాడు సమృద్ధిగా నీళ్లు విడుదల చేయకపోవడంతో లక్షాన్ని చేరుకోలేక పోయింది.తెలంగాణ ప్రత్యేక రాష్త్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయకట్టు స్థిరీకరించేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆ దిశగా గత రబీలోనే ప్రభుత్వం కాలువ చివరి వరకు నీళ్లు పోయేలా చేసి కొంత సఫలీకృతమైంది.
రికార్డు స్థాయిలో నీటివిడుదల
కాకతీయ కాలువ ద్వారా రికార్డు స్థాయిలో నీళ్ల విడుదల జరుగుతుంది. గత రబీలో 4500 క్యూసెక్కుల నీళ్లను విడుదల చేయగా, ప్రస్తుతం 5వేల క్యూసెక్కుల నీళ్లు వెళ్తున్నాయి. అదే విధంగా కాకతీయ కాలువ కింద గల చివరిలో ఉన్న అన్ని డిస్ట్రిబ్యూటర్లు డీబీఎం చివరి ఆయకట్టు భూములకు ఎల్‌ఎండీ నీళ్లు వెళ్తుండడం గమనార్హం. మున్ముందు 7500క్యూసెక్కులను వదిలిపెట్టేందుకు పనులు జరుగుతున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
మంత్రి ఈటల కృషి మరువలేనిది
చివరి ఆయకట్టుకు నీళ్లు వెళ్లడంలో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ కృషి మరువలేనిది. దాన్ని ఆధునీకరణకు సంవత్సరాల క్రితమే నడుం బిగించారు. దీని కోసం నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్‌లను రప్పించి కాకతీయ కాలువ యొక్క స్థితిగతులను వివరించారు. తక్షణమే ఆనాడు రూ.147కోట్ల నిధులను అభివృద్ధి పనుల కోసం ప్రభు త్వం కేటాయించగా, వీటితో శిథిలావస్థలో ఉన్న లైనింగ్, డిస్టిబ్యూటర్లు, యూటీల మరమ్మత్తులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేశారు. ప్రస్తుతం 600కోట్లతో కాకతీయ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి.
సంబరంలో రైతులు
కాకతీయ ప్రధాన, ఉప కాలువల్లో పుష్కలంగా నీళ్ల రాకతో రైతులు సంబరంలో మునిగిపోయారు. గత రబీలో 2200క్యూసెక్కుల నీళ్లు ప్రధాన కాలువల్లో వెళ్లగా, ప్రస్తుతం 3500క్యూసెక్కుల నీళ్లు వస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.

పంట చివరి దశ వరకూ నీరు 

ఃకాకతీయ కాలువ ప్రధాన కాలువతో చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుంది. గత ప్రభుత్వాలు  ప్రాజెక్టులను పట్టించుకోకున్నా. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి వల్ల పంట చివర వరకు ఎండి పోకుండా ఈ నీళ్లు ఎంతగానో సద్వినియో గమవుతాయి. పంటలు ఎండి పోకుం డా నీళ్లు అందించడం అభినందనీయం.

Related Stories: