డెంగీతో బాలుడు మృతి..!

కరీంనగర్: డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ పీటల్స్ పిల్లల ఆస్పత్రిలో జరిగింది. డెంగీ సోకినట్లు గుర్తించిన వైద్యులు ప్రత్యేకంగా వైద్యసేవలు అందించారు. కాగా, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. అయితే, వైద్యుల నిర్లక్ష్యమే కారణంగానే తమ కొడుకు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆస్పత్రి ముందు బైఠాయించారు.

Related Stories: