మార్పు రావాలి…పల్లెలు శుభ్రం కావాలి

సదాశివనగర్:పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. గ్రామాల్లో పారిశుధ్యం సమస్యలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే పట్టణాల్లో కాకుండా చిన్న విస్తీర్ణాల్లో ఉంటాయి. గ్రామాల్లో నివాసాలు తక్కువగానే ఉంటాయి. దీంతో వీరు శభ్రతను పెద్దగా పట్టించుకోకుండా గ్రామ పరిసరాల్లో చెత్త వేయడంతో పాటు మల మూత్రాలకు వెళ్తారు. దీంతో పరిసరాలు దుర్గంధంగా మారి ప్రజారోగ్యం దెబ్బతింటుంది. అయితే వందల ఏళ్ళ నుండి గ్రామీణ ప్రాంత ప్రజలకు మరుగుదొడ్ల వాడకం పై అవగాహన లేకపోవడంతో మరుగుదొడ్ల వినియోగం జరగడం […]

సదాశివనగర్:పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. గ్రామాల్లో పారిశుధ్యం సమస్యలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే పట్టణాల్లో కాకుండా చిన్న విస్తీర్ణాల్లో ఉంటాయి. గ్రామాల్లో నివాసాలు తక్కువగానే ఉంటాయి. దీంతో వీరు శభ్రతను పెద్దగా పట్టించుకోకుండా గ్రామ పరిసరాల్లో చెత్త వేయడంతో పాటు మల మూత్రాలకు వెళ్తారు. దీంతో పరిసరాలు దుర్గంధంగా మారి ప్రజారోగ్యం దెబ్బతింటుంది. అయితే వందల ఏళ్ళ నుండి గ్రామీణ ప్రాంత ప్రజలకు మరుగుదొడ్ల వాడకం పై అవగాహన లేకపోవడంతో మరుగుదొడ్ల వినియోగం జరగడం లేదు. రోజురోజుకు మారుతున్న కాలంతోపాటు గ్రామీణ ప్రాంతాలు సైతం వివిధ రంగాల్లో ముందుకు వెళ్తున్నాయి. కానీ మరుగుదొడ్ల నిర్మాణాలు, పారిశుధ్యంలో అభివృద్ధి సాధించలేకపోతున్నాయి. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు వాటి అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఉందని మహాత్మగాంధీ అన్నమాటలు, ఆయన కన్నకలలు సాకారం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్‌లాంటి పథకాలను ప్రవేశపెట్టి అమలుకు కృషి చేస్తున్నాయి. అయినా ఆశించిన మార్పులు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 2017 ఆగస్టు 16న స్వచ్ఛభారత్ హాకధాన్ 1.0 అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ ప్రారంభించారు. తెలంగాణలో 53% మరుగుదొడ్లు ఉన్నాయని స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ నీతూప్రసాద్ గతేడాదిలో తెలిపారు.

సదాశివనగర్ మండలంలో….

మండల కేంద్రంతో పాటు అనేక గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. సర్పంచ్‌ల పదవీకాలం పూర్తి కావడంతో గ్రామ పాలనను ప్రత్యేక అధికారులకు అప్పగించారు. అయితే గ్రామాల పై స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులకంటే తక్కువ అవగాహన ఉండటంతో సైతం గ్రామసమస్యలు సకాలంలో పరిష్కరించలేకపోతున్నారనే వాదన ఉంది. ప్రత్యేక అదికారులు తాము అప్పటికే విధులు నిర్వహిస్తున్న శాఖలకు పూర్తి న్యాయం చేస్తూ గ్రామాల పాలన వ్యవహారాలు చూసుకోలేకపోతున్నారని పలువురి అభిప్రాయం. దీంతో గ్రామాలలో పారిశుధ్యం, మరుగుదొడ్ల పనుల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. అలాగే ఈ గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరిగినా అవి వాడకంలో ఉండటం లేదు. ఏదేమైనా అవగాహన లోపం వల్ల జరుగుతున్న ఇలాంటి చర్యలతో ప్రజారోగ్యం పాడవుతుందని తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కొన్ని గ్రామాల్లో యువనాయకులు, స్వచ్ఛంద సంస్థలు స్వయంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Village Clean with awareness

Telangana news