బౌలింగ్ చేస్తావా…బౌలర్‌నే మార్చాలా: ధోనీ

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌కు విశ్రాంతి నివ్వడంతో ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌తో ధోనీ 200 వన్డేలకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఫీల్డర్ విషయంలో స్పిన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్‌పై ధోనీ ఘాటుగానే స్పందించాడు. కుల్‌దీప్ పదే పదే ఫీల్డర్ మార్చుతుండడంతో బౌలింగ్ చేస్తావా లేక బౌలర్ మార్చమంటావా అని హెచ్చరించాడు. దీంతో కుల్‌దీప్ చేసేదేమీలేక బౌలింగ్ చేశాడు. ఇప్పుడు ఈ […]

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌కు విశ్రాంతి నివ్వడంతో ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌తో ధోనీ 200 వన్డేలకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఫీల్డర్ విషయంలో స్పిన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్‌పై ధోనీ ఘాటుగానే స్పందించాడు. కుల్‌దీప్ పదే పదే ఫీల్డర్ మార్చుతుండడంతో బౌలింగ్ చేస్తావా లేక బౌలర్ మార్చమంటావా అని హెచ్చరించాడు. దీంతో కుల్‌దీప్ చేసేదేమీలేక బౌలింగ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న స్టంప్ మైక్రోఫోన్ లో రికార్డయ్యాయి. భారత్-ఆఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయిన విషయం తెలిసిందే. గతంలో బౌలర్ శ్రీశాంత్‌కు కూడా ఇలాగే కౌంటర్ ఇచ్చాడు. ఫీల్డింగ్ విషయంలో ఓయ్ శ్రీ అక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ లేదు…. కొంచెం ఇక్కడికి రా అంటూ ధోనీ చమత్కారంతో వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

 

 

Asia Cup: Dhoni Serious on Kuldeep Yadav

Telangana news

Comments

comments