బ్యాంక్ ఖాతాలకు ఆధార్ తప్పనిసరికాదు: సుప్రీం

ఢిల్లీ: ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. జస్టిస్ ఎకె సిక్రీ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్ విశిష్టమైనదిగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఆధార్ సమాచారం ఇవ్వవద్దని కోర్టు సూచించింది. ఆధార్ వివరాలు బయటికి పొక్కకుండా కట్టుదిట్టమైన చట్టాలు చేయాలని ఆదేశించింది. పాఠశాలల్లో […]

ఢిల్లీ: ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. జస్టిస్ ఎకె సిక్రీ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్ విశిష్టమైనదిగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఆధార్ సమాచారం ఇవ్వవద్దని కోర్టు సూచించింది. ఆధార్ వివరాలు బయటికి పొక్కకుండా కట్టుదిట్టమైన చట్టాలు చేయాలని ఆదేశించింది. పాఠశాలల్లో ప్రవేశాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయొద్దని, చొరబాటుదారులకు ఆధార్ మంజూరు చేయొద్దని పేర్కొంది.

సిబిఎస్‌ఇ, నీట్ తరహా పరీక్షలకు ఆధార్ తప్పనిసరి కాదని వివరించింది. ఆధార్ తప్పనిసరని సిబిఎస్‌ఇ విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ తప్పనిసరికాదని వెల్లడించింది. మొబైల్ కనెక్షన్లకు ఆధార్ తప్పనిసరి కాదని, ఆధార్ ఇవ్వాలని మొబైల్ కంపెనీలు డిమాండ్ చేయకూడదని స్పష్టం చేసింది. చదువు మనల్ని వేలిముద్ర నుంచి సంతకాలకు తీసుకెళ్లిందని, సాంకేతిక పరిజ్ఞానం సంతకాల నుంచి మళ్లీ వేలిముద్రలకు తీసుకొచ్చిందని జస్టిస్ సిక్రీ ధర్మాసనం పేర్కొంది.

Aadhaar not Mandatory for Bank Accounts

Telangana news

Related Stories: