ముగిసిన ఓటర్ల జాబితా సవరణ దరఖాస్తుల గడువు

చివరి రోజున 2లక్షల అర్జీలు! మొత్తం 25లక్షలు దాటే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ, అభ్యంతరాలు, కొత్త ఓటర్లు, తొలగింపు, మృతుల పేర్లను తొలగించడం.. ఇలా అనేక రకాల విజ్ఞప్తులకు మంగళవారంతో దరఖాస్తు చేసుకోడానికి గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ఓటరు కార్డులో పేరు, అడ్రస్ మార్పులతో పాటు కొత్తగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు వెల్లువలా వచ్చా యి. దాదాపు ఒకే రోజు ఆన్‌లైన్, బూత్ స్థాయి అ ధికారుల […]

చివరి రోజున 2లక్షల అర్జీలు!
మొత్తం 25లక్షలు దాటే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ, అభ్యంతరాలు, కొత్త ఓటర్లు, తొలగింపు, మృతుల పేర్లను తొలగించడం.. ఇలా అనేక రకాల విజ్ఞప్తులకు మంగళవారంతో దరఖాస్తు చేసుకోడానికి గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ఓటరు కార్డులో పేరు, అడ్రస్ మార్పులతో పాటు కొత్తగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు వెల్లువలా వచ్చా యి. దాదాపు ఒకే రోజు ఆన్‌లైన్, బూత్ స్థాయి అ ధికారుల ద్వా రా రెండు లక్షల దరఖాస్తుల వర కు వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కా ర్యాలయం అధికారులు పేర్కొన్నారు. బిఎల్‌ఒలు సాయం త్రం వరకు దరఖాస్తులు తీసుకున్నప్పటికీ ఆన్‌లైన్‌లో రాత్రి 12 గంటల వరకు అవకా శం కల్పించినట్లు తెలిపారు. అయితే చివరి రో జున ఒకేసారి లక్షల మంది ఆన్‌లైన్‌లో సవరణ, అభ్యంతరాలతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావడంతో వెబ్‌సైట్ ఒపెన్ కాక మొరాయించిందని, మధ్యాహ్నాం నుంచే సిఇఒకు ఫిర్యాదులు అందాయని కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. సవరణలు, అభ్యంతరాలకే గడువు ముగిసిందని, కొత్తగా ఓటరుగా నమోదయ్యే వారికి నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు అవకాశం ఉందని సిఇఒ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఈ నెల 24వ తేదీ వరకు అన్ని రకాల అవసరాలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య దాదాపు 23.88 లక్షలు అని, మంగళవారం వచ్చిన వాటితో కలిపి ఇది 25 లక్షల దాటే అవకాశం ఉందని, పూర్తి వివరాలు బుధవారం సాయంత్రం నాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. తొలగించబడుతున్న ఓటర్లకు ఈసారి ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తున్నామని అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. రిజిస్టర్, రిపోర్టెడ్ మరణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇఆర్‌ఒ నెట్ నుంచి తీసుకున్న నోటీసును సంబంధిత ఓటరు అడ్రస్‌లో అందిస్తున్నామన్నారు.
పరిష్కరించడమే కత్తిమీద సాము
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడమే సిఇఒ సిబ్బందికి ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. ఇఆర్‌ఒ నెట్ చాలా నెమ్మదిగా పనిచేయడమే ఇందుకు ప్రధాన కారణం. కొత్తగా దరఖాస్తులు చేసుకునే ఎన్‌విఎస్‌పి వెబ్‌సైట్, సిఇఒ తెలంగాణ రెండు వెబ్‌సైట్లు సరిగ్గా ఒపెన్ కావడం లేదు. ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని ఇఆర్‌ఒ నెట్‌లో ఆప్‌లోడ్ చేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలూ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఒక్కో దరఖాస్తును పరిశీలించేందుకు దాదాపు 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఈ కారణంగా డాష్ బోర్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడం లేదు. సిఇఒ వర్గాల సమాచారం మేరకు దాదాపు 12 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 18 ఏళ్ల లోపు, 100 ఏళ్ల దాటిన ఓటర్ల వివరాలపై లాజికల్ తప్పులు వస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ‘సిడాక్’ టీమ్ పనిచేస్తున్నప్పటికీ అప్లికేషన్ డిజైన్‌లోనే లోపాలు ఉండటంతో వాటిని అధిగమించడం కష్టంగా మారింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 32 వేలకుపైగా బిఎల్‌ఒలు పనిచేస్తున్నారని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. దాదాపు 10 వేల మంది బిఎల్‌ఒలు విధులకు హాజరు కావడమే లేదని తెలిసింది. ఇలాంటి అనుమానాల నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన పాతిక లక్షల దరఖాస్తులను బూత్ స్థాయిలో పరిశీలించి తొమ్మిది రోజుల వ్యవధిలోనే పూర్తిచేసి వెబ్‌సైడ్‌లోకి అప్‌లోడ్ చేయడం కత్తిమీద సాములా మారింది. అనేక మంది బూత్ స్థాయి సిబ్బంది సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ కొన్నిచోట్ల హాజరుకాకుండానే పరిశీలన ప్రక్రియను పూర్తి చేసినట్లు వారంతట వారుగా రాసుకుంటున్నట్లు నగర ప్రజల నుంచి సిఇఓ కార్యాలయానికి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.

Comments

comments

Related Stories: