కోదండ రాం..రాం

అమర వీరుల  ఆకాంక్షలకు   కోదండ రాం..రాం  ఏ అమరుడు చెప్పాడని, ఏ అమరుల కుటుంబాలు సూచించాయని తెలంగాణ వ్యతిరేక పార్టీలతో కోదండరాం అంటకాగుతున్నారు? స్వాహా కూటమితో పొత్తు ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరుస్తారో ఆయన చెప్పాలి : సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్నలు మనతెలంగాణ / సిరిసిల్ల : ఏ అమరుడు చెప్పాడని, ఏ అమరుల కుటుంబాలు చెప్పాయని తెలంగాణ వ్యతిరేక పార్టీలతో కోదండరాం అం టకాగుతున్నారని, కోదండరాం ఆత్మాభిమానా […]

అమర వీరుల  ఆకాంక్షలకు   కోదండ రాం..రాం

 ఏ అమరుడు చెప్పాడని, ఏ అమరుల కుటుంబాలు సూచించాయని తెలంగాణ వ్యతిరేక పార్టీలతో కోదండరాం అంటకాగుతున్నారు?
స్వాహా కూటమితో పొత్తు ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరుస్తారో ఆయన చెప్పాలి : సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్నలు

మనతెలంగాణ / సిరిసిల్ల : ఏ అమరుడు చెప్పాడని, ఏ అమరుల కుటుంబాలు చెప్పాయని తెలంగాణ వ్యతిరేక పార్టీలతో కోదండరాం అం టకాగుతున్నారని, కోదండరాం ఆత్మాభిమానా న్ని తాకట్టు పెట్టుకోవద్దు, ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి కెటిఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో మానేరు నదిలో బతుకమ్మఘాట్ నిర్మాణాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోదండరాంను ఏ అమర వీరులు, వారి కుటుంబాలు అపవిత్రపొత్తుకు ప్రోత్సహించాయో తెలపాలన్నారు. తెలంగాణ ప్రజలను దశాబ్దాలుగా గోసపెట్టిన పార్టీలు కాంగ్రెస్, టిడిపిలని వాటివల్లే తెలంగాణలో అనేకమంది అమరులయ్యారని, అలాంటి వారితో కోదండరాం ఎలా అంటకాగుతారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు స్వాహ కూటమి పొత్తుతో ఎలా నెరవేరుస్తారో కోదండరాం తెలపాలన్నారు. ఆత్మవంచనతో కోదండరాం మూడు సీట్ల కోసం కాం గ్రెస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, కోదండరాం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోకుండా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. స్వాహకూటమితో కోదండరాం అంటకాగితే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు పిచ్చివాళ్లా అన్నారు. ప్రజలను ఇబ్బంధుల పాలు చేస్తున్న కాంగ్రెస్‌ను నిలువెత్తు గోతిలో పాతిపెట్టడానికి, బొందపెట్టడానికి ఎన్‌టిఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ విలువలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్‌తో పొత్తు కలవడాన్ని తెరాస నాయకులు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని టిడిపి నాయకులు, ప్రభుత్వంలోని పెద్దలు ఉప ముఖ్యమంత్రులు కేఇ కృష్ణమూర్తి, చినరాజప్ప, హోం మంత్రి అయ్యన్న పాత్రుడులే విమర్శించారని, కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంటే ప్రజలు టిడిపిని నిలువెత్తుగోతిలో పాతిపెడతారని, గుడ్డలూడదీసి కొడతారని అన్నారని కెటిఆర్ జ్ఞాపకం చేశారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా అధికార దాహంతో కాంగ్రెస్,టిడిపి పొత్తుకు దిగాయన్నారు.తెలంగాణలోని కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు కట్టకుండా చంద్రబాబు నాయుడు కేంద్రానికి 30 లేఖలు రాశాడని, అలాంటి వ్యక్తి నాయకత్వంలోనివారు అధికారంలోకి వస్తే తెలంగాణ రైతులకు నోట్లో మట్టి కొడతారని, రైతులకు కన్నీళ్లే మిగులుతాయన్నారు. అధికార దాహంతో రగిలిపోతున్న వారితో నిస్సిగ్గుగా కోదండరాం కలిసారని, డిల్లీలోని వారికి బానిసలైనవారికి, అమరావతిలోనివారికి గులాములైనవారికి అధికారం ఇద్దామా లేక తెలంగాణలో నిర్ణయాలు తీసుకునేవారికి అధికారం ఇవ్వాలా అనేది ప్రజలే ఆలోచించాలన్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేనాయకులు కావాలా, లేక ఆత్మగౌరవంతో బతకాలా ఆలోచించాలన్నారు. కోదండరాం 119 సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించి ఇప్పుడు ముష్టి మూడు సీట్లకోసం దేబిరిస్తున్నారన్నారు. ఆయన ప్రజాబలం ఇదేనా అన్నారు. కొండా సురేఖలాంటి వారు పార్టీని వదిలేప్పుడు పార్టీపై కొన్ని నిందలు,రాళ్లు వేయడం సహజమని, అవతలివారి మెప్పుకోసం ఇలాంటివి చేస్తారని,వారికి జవాబు ప్రజలే చెపుతారన్నారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏర్పాటైన మహ కూటమి కాదది.. స్వాహ కూటమి అని తెలంగాణ ప్రజలను దశాబ్దాలుగా గోసపెట్టిన పార్టీలు కాంగెస్, టిడిపిలని మంత్రి కే తారక రామారావు సిరిసిల్లలో అన్నారు. ఒకరికి వ్యతిరేకంగా మరో పార్టీ పుట్టి ఇప్పుడు స్వార్థంతో, అధికార దాహంతో అన్ని విలువలకు తిలోదకాలిచ్చి పొత్తుకు దిగడం ఆత్మవంచనే అవుతుందన్నారు.

Comments

comments