మళ్లీ కెప్టెన్‌గా మహి
దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన సూపర్4 మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ సింగ్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకు అఫ్గాన్ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. దీంతో ధోని ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ధోని కెరీర్లో కెప్టెన్‌గా ఇది 200వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. చాలా కాలం క్రితమే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ మ్యాచ్‌లో మరోసారి కెప్టెన్ అవతారం ఎత్తాడు. అతని సారథ్యంలో భారత్ 199 వన్డేలు ఆడింది. తాజాగా ఇది 200 మ్యాచ్ కావ డం మరో అరుదైన విషయం చెప్పొచ్చు. ఆసియాకప్‌కు విరా ట్ కోహ్లి దూరంగా ఉండడంతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను నియమించారు. అయితే వీరిద్దరికి అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌లో విశ్రాంతి కల్పించారు. ఈ పరిస్థితుల్లో సీనియర్ ఆటగాడైన ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. తమ ఆరాధ్య ఆటగాడు మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టడంతో ధోని అభిమాను ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
Comments
comments