భారత్ క్లీన్ స్వీప్

కొలంబో: శ్రీలంకతో జరిగిన మహిళల ట్వంటీ20 సిరీస్‌ను భారత్ 40తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఆఖరి టి20లో భారత్ 51 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ భారత జట్టు జయకేతనం ఎగుర వేసి సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఇంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా భారత జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. లంకతో జరిగిన చివరి టి20లో ముందుగా […]

కొలంబో: శ్రీలంకతో జరిగిన మహిళల ట్వంటీ20 సిరీస్‌ను భారత్ 40తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఆఖరి టి20లో భారత్ 51 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ భారత జట్టు జయకేతనం ఎగుర వేసి సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఇంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా భారత జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. లంకతో జరిగిన చివరి టి20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 156 పరుగులకే ఆలౌటైంది. జమీమా రోడ్రిగ్స్ మరోసారి అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. మరోవైపు హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో తనవంతు సహకారం అందించింది. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుచుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోడ్రిగ్స్ 31 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేసింది. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ 36 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో 63 పరుగులు సాధించింది. అయితే వీరిద్దరూ తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క మిథాలీరాజ్ (12) తప్ప మిగతావారు కనీసం రెండంకెలా స్కోరును కూడా అందుకోలేక పోయారు. లంక బౌలర్లలో సిరవర్దనే, ప్రియదర్శిని మూడేసి వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ మరో బంతులు మిగిలివుండగానే ముగిసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక 17.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. అనుష్క సంజీవని (29), శశికల సిరివర్దనే (22), రణసింఘే (22) తప్ప ఎవరూ పెద్దగా రాణించలేక పోయారు. భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. పూనమ్‌కు మూడు వికెట్లు దక్కగా, దీప్తి శర్మ, రాధా యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Comments

comments