అట్టహాసంగా క్రీడా పురస్కారాల ప్రధానం

ఖేల్ రత్న అందుకున్న కోహ్లి, చాను న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతిష్టాత్మకమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోహ్లికి ఈ అవార్డును అందజేశారు. వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కూడా ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగుతేజం, స్టార్ షట్లర్ సిక్కి రెడ్డి, దిగ్గజ అథ్లెట్లు నీరజ్‌చోప్రా, హిమాదాస్, జిన్సన్ జాన్సన్ తదితరులకు రాష్ట్రపతి అర్జున అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ […]

ఖేల్ రత్న అందుకున్న కోహ్లి, చాను

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతిష్టాత్మకమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోహ్లికి ఈ అవార్డును అందజేశారు. వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కూడా ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగుతేజం, స్టార్ షట్లర్ సిక్కి రెడ్డి, దిగ్గజ అథ్లెట్లు నీరజ్‌చోప్రా, హిమాదాస్, జిన్సన్ జాన్సన్ తదితరులకు రాష్ట్రపతి అర్జున అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులకు రాష్ట్రపతి అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్త్న్రాలను బహుకరించారు. పురస్కారంతో పాటు రూ. 7.5 లక్షల నగదును వీరికి అందజేశారు. మరోవైపు శ్రీనివాస రావు (టిటి), సుఖ్‌దేవ్ సింగ్ పన్ను (అథ్లెటిక్స్), తారక్‌సిన్హా (క్రికెట్), జివాన్ కుమార్ శర్మ (జూడో)లకు ద్రోణాచార్య అవార్డులను అందజేశారు. ఇక, సిక్కిరెడ్డి (బ్యాడ్మింటన్), సతీష్ కుమార్ (బాక్సింగ్), హిమాదాస్ (అథ్లెటిక్స్), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్)లకు రాష్ట్రపతి అర్జున అవార్డులను అందజేశారు. అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలకు రూ ఐదు లక్షల నగదు బహుమతిని అందించారు. కాగా, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి బాలీవుడ్ నటి, కోహ్లి సతిమణి అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Related Stories: