100డాలర్లకు చేరనున్న క్రూడాయిల్

   ఏడాది చివరికల్లా మరింత పెరగనున్న బ్యారెల్ ధర     ముడిచమురు దిగుమతులపై కోత యోచనలో భారత్ న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లకుపైగా ధరపలకనున్నదని ఆయిల్ ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులను తగ్గించుకుని, ఇన్వెంటరీల్లో  ఇప్పటికే నిల్వచేసుకున్న చౌక ముడిచమురు మీద ఆధారపడాలనుకుంటోందని చమురు పారిశ్రామిక ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ సోమవారం మార్కెట్‌లో 2 శాతం పెరిగి బ్యారెల్ ధర 80 డాలర్లకు […]

   ఏడాది చివరికల్లా మరింత పెరగనున్న బ్యారెల్ ధర 

   ముడిచమురు దిగుమతులపై కోత యోచనలో భారత్

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లకుపైగా ధరపలకనున్నదని ఆయిల్ ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులను తగ్గించుకుని, ఇన్వెంటరీల్లో  ఇప్పటికే నిల్వచేసుకున్న చౌక ముడిచమురు మీద ఆధారపడాలనుకుంటోందని చమురు పారిశ్రామిక ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ సోమవారం మార్కెట్‌లో 2 శాతం పెరిగి బ్యారెల్ ధర 80 డాలర్లకు చేరుకుంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమలుచేయనున్న నేపథ్యంలో మార్కెట్‌లు కూడా బిగుసుకున్నాయి. 2018 చివరినాటికి ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లు చేరుకుంటుందని కామోడిటీ వాణిజ్యసంస్థ ట్రాఫిగుర అండ్ మెర్కూరియా జోస్యం చెప్పింది. భారత కరెన్సీ ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలోనే చమురు ధరలకు రెకలు వచ్చాయి. రూపాయి విలువ ప్రకారం ఈ ఏడాది ముడిచమురు దిగుమతుల ఖర్చు 47 శాతం ఎక్కువ అయింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా భారత్ ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి దిగుమతుల్లో కోత విధించి, నిలలపై ఆధారపడాలని భావిస్తోంది. చమురు దిగుమతుల కోత విధింపు, నిల్వల వినియోగ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ ధ్రువీకరించారు. అంతేకాక సెప్టెంబర్ 15న జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి రిఫైనరీ అధికారులు హాజరయ్యారు. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర సోమవారం 30 శాతం పెరిగి 80.47 డాలర్లకు చేరుకుంది. కాగా అమెరికా డాలరు మారకంతో భారత కరెన్సీ రూపాయి 33 పైసలు పడిపోయి రూ. 72.96 అయింది. చమురు దిగుమతుల వ్యయం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా భారత్ పెట్రోల్ ధరలే ఎక్కువగా ఉన్నాయి. వ్యక్తి స్థూల ఉత్పత్తిలో ఇది ఎక్కువ భాగంగా ఉంటోంది. చమురు దిగుమతులను తగ్గించడాన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అధిపతి రామచంద్రన్ ధ్రువీకరించారు. దీనిపై హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నయార ఎనర్జీ వంటి రిఫైనరీలు ప్రతిస్పందించలేదు.