ఎన్‌పిలు డౌన్.. రుణాల రికవరీ అప్

 దివాలా చట్టం ప్రభావవంతంగా పనిచేస్తోంది  8 శాతం వృద్ధిని సాధిస్తాం  బ్యాంక్ చీఫ్‌ల సమావేశంలో జైట్లీ న్యూఢిల్లీ: దివాలా చట్టం(ఐబిసి) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, దీనివల్ల బ్యాంకుల్లో మొండి బకాయిలు లేదా ఎన్‌పిఎలు(నిరర్థక ఆస్తులు) గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రుణాల రికవరీ పెరిగిందని అన్నారు. అనేక సంవత్సరాలుగా ఎన్‌పిఎలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పేరుకుపోయి, ఇవి ప్రభుత్వానికి ఒక సమస్యగా మారాయి. ప్రస్తుతం బ్యాంకింగ్ మంచి వృద్ధి దిశగా అడుగులు […]

 దివాలా చట్టం ప్రభావవంతంగా పనిచేస్తోంది
 8 శాతం వృద్ధిని సాధిస్తాం
 బ్యాంక్ చీఫ్‌ల సమావేశంలో జైట్లీ

న్యూఢిల్లీ: దివాలా చట్టం(ఐబిసి) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, దీనివల్ల బ్యాంకుల్లో మొండి బకాయిలు లేదా ఎన్‌పిఎలు(నిరర్థక ఆస్తులు) గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రుణాల రికవరీ పెరిగిందని అన్నారు. అనేక సంవత్సరాలుగా ఎన్‌పిఎలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పేరుకుపోయి, ఇవి ప్రభుత్వానికి ఒక సమస్యగా మారాయి. ప్రస్తుతం బ్యాంకింగ్ మంచి వృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, ప్రస్తుతం సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని, బ్యాంకుల్లో ద్రవ్యలభ్యత సమస్య ఉండదని అన్నారు. మంగళవారం ఇక్కడ ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో జరిగిన సమావేశంలో జైట్లీ ఈవిధంగా అన్నారు. ఈ సమావేశానికి 21 ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన సిఇఒలు హాజరయ్యారు. సమావేశంలో క్రెడిట్ గ్రోత్, రికవరీ, సంస్కరణలు వంటి అంశాలపై చర్చించినట్టు జైట్లీ తెలిపారు. మోసం, ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై బ్యాంకులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దివాలా చట్టంతో సానుకూల స్పందన వచ్చిందని, ఈ చట్టంతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు వేగవంతమయ్యాయని, దీంతో రుణాల రికవరీ పెరిగిందని జైట్లీ వివరించారు. దేశీయ వృద్ధి రేటు 8 శాతానికి చేరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు రూ.36,551 కోట్లను బ్యాంకులు రికవరీ చేశాయని, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 49 శాతం వృద్ధిని సాధించిందని జైట్లీ తెలిపారు. 201718లో బ్యాంకులు రూ.74,562 కోట్లు రుణాలను వసూళు చేశాయి. దివాలా చట్టం, జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను), డీమానిటైజేషన్, డిజిటల్ పేమెంట్లు ద్వారా ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ సాధ్యమైందని, ఇంకా ఆర్థిక సామర్థం పెరిగి, సమస్యల పరిష్కారం జరిగిందని వివరించారు. డిఆర్‌టి(డెబిట్ రికవరీ ట్రిబ్యునల్) యంత్రాంగం సామర్థం పెంచడం, రుణాల రికవరీ మరింత వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టనున్నామని అన్నారు.
దివాలా చట్టంతో రూ.1.8 లక్షల కోట్ల రికవరీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దివాలా చట్టం, ఇతర మార్గాల ద్వారా బ్యాంకులు రూ.1.8 లక్షల కోట్లను రికవరీ చేసే అవకాశముందని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ అన్నారు. సమస్యలపై దృష్టి పెట్టనున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు రూ.18 వేల కోట్ల విలువచేసే కీలకం కాని ఆస్తులను విక్రయించనున్నట్టు ఆయన తెలిపారు. మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను విలీనం చేయనున్నట్టు ఇటీవల రాజీవ్ కుమార్ ప్రకటించారు. దీంతో దేశంలో మూడో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అవతరించనుంది. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు అవసరమని, బ్యాం కుల మూలధనం సంరక్షణకు ప్రభుత్వం తగిన చర్య లు చేపడుతోందని ప్రభుత్వం పేర్కొంది. బ్యాంకింగ్ రం గంలో విదేశీ సేవల హేతుబద్ధీకరణ ఊపందుకుంది. బ్యాంకింగ్ రంగానికి గుదిబండలా మారిన మొండి బకాయిలు, చరిత్రలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.రుణాల మంజూరులో కఠిన నిబంధనలు,ఒత్తిడి ఆస్తుల పరిష్కారం,ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తు లు) విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం, ఎన్‌పిఎలకు కేటాయింపులపై నిర్ణయాలతో పాటు క్లీన్ బ్యాంకింగ్ దిశగా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది.

Comments

comments