బ్యాంకులకు రూ.5వేల కోట్ల గుజరాతీ టోపీ

నకిలీ డాక్యుమెంట్లతో పలు బ్యాంకులను మోసం చేసిన గుజరాతీ ఫార్మా కంపెనీ డైరెక్టర్ నితిన్ సందేసర న్యూఢిల్లీ : మాల్యా, నీరవ్ మోడీ తరహాలో మరో వ్యాపారవేత్త వేలాది కోట్లు మోసం చేసి విదేశాలకు చెక్కేశారు. రూ.5వేల కోట్లు మోసం కేసులో పరారీలో ఉన్న గుజరాత్‌కు చెందిన ఫార్మా కం పెనీ డైరెక్టర్ నితిన్ సందేసర గత నెలలో దుబాల్ లో అరెస్టయ్యాడని వార్తలు వెలువడ్డాయి. అయి తే అదేమీలేదని ఆయన నైజీరియాకు పారిపోయాడని సిబిఐ, ఇడి(ఎన్‌ఫోర్స్‌మెంట్ […]

నకిలీ డాక్యుమెంట్లతో పలు బ్యాంకులను మోసం చేసిన గుజరాతీ ఫార్మా కంపెనీ డైరెక్టర్ నితిన్ సందేసర

న్యూఢిల్లీ : మాల్యా, నీరవ్ మోడీ తరహాలో మరో వ్యాపారవేత్త వేలాది కోట్లు మోసం చేసి విదేశాలకు చెక్కేశారు. రూ.5వేల కోట్లు మోసం కేసులో పరారీలో ఉన్న గుజరాత్‌కు చెందిన ఫార్మా కం పెనీ డైరెక్టర్ నితిన్ సందేసర గత నెలలో దుబాల్ లో అరెస్టయ్యాడని వార్తలు వెలువడ్డాయి. అయి తే అదేమీలేదని ఆయన నైజీరియాకు పారిపోయాడని సిబిఐ, ఇడి(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) వర్గాలు స్పష్టం చేశాయి. నితిన్ సోదరుడు చేతన్ సందేసర, మరదలు దీప్తిబెన్ సందేసర సహా కు టుంబ సభ్యులు నైజీరియలోనే తలదాచుకున్నార ని పేర్కొంటున్నారు. నితిన్‌కు చెందిన స్టెర్లింగ్ బ యోటెక్ గ్రూప్ ప్రమోటర్లు నకిలీ, తప్పుడు  డా క్యుమెంట్లతో పలు బ్యాంకుల నుంచి సేకరించిన రూ.5వేల కోట్లు అనంతరం మొండిబాకీలుగా మారాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఎస్‌బిఐ, ఆంధ్రా బ్యాంక్, యూకో బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి బ్యాంకుల కన్సార్టియం రుణాలను మంజూరు చేసింది. కాగా ఈ కేసుకు సం బంధించి యుఎఇ అధికారులు గతనెలలో దుబాయ్‌లో నితిన్ సందేసరను అదుపులోకి తీసుకున్న ట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని తాజాగా అధికార వర్గాలు తెలిపాయి.రూ.5వేల కోట్ల బ్యాంక్ అక్రమ లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి గుజరాత్‌కు చెందిన నితిన్ సందేసర కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్‌కు చెందిన రూ.4700 కోట్ల విలువైన ఆస్తులను ఇడి జూన్ లో జప్తు చేసింది.

Comments

comments