ముంబైలో 90

దేశ ప్రజల కుత్తుకలపై నుంచి పెట్రో రన్ సోమవారం కూడా పెరిగిన ధరలు పెట్రోల్‌పై 11, డీజెల్‌పై 5 పైసలు ఢిల్లీలో లీటర్ రూ. 82.72, ముంబైలో రూ. 90.08 న్యూఢిల్లీ: రూపాయి పతనంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజెల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూ సరి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత కొద్ది రో జులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజెల్ ధరలు సోమవారం కూడా పెరిగాయి. ప్రభు త్వ […]

దేశ ప్రజల కుత్తుకలపై నుంచి పెట్రో రన్

సోమవారం కూడా పెరిగిన ధరలు
పెట్రోల్‌పై 11, డీజెల్‌పై 5 పైసలు
ఢిల్లీలో లీటర్ రూ. 82.72, ముంబైలో రూ. 90.08

న్యూఢిల్లీ: రూపాయి పతనంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజెల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూ సరి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత కొద్ది రో జులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజెల్ ధరలు సోమవారం కూడా పెరిగాయి. ప్రభు త్వ రంగ చమురు కంపెనీల ప్రకటన ప్రకా రం సోమవారం పెట్రోలు లీటరుకు  11 పై సలు, డీజెలు లీటరుకు 5 పైసలు పెరిగాయి. ఫలితంగా ఢిల్లీలోపెట్రోల్ ధర లీటరుకు రూ. 82.72కు, డీజెల్ లీటరుకు రూ. 74. 02కు చేరుకున్నాయి. నాలుగు మెట్రో నగరాల్లో అత్యధికంగా పెట్రో ధరలు ఉండే ముంబయిలో పెట్రోలు ధర లీటరుకు రూ.90ని దా పోయింది. నగరంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో లీటరు రూ.90.08 ఉం డగా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ బంకుల్లో రూ.90.17, బిపిసిఎల్ బంకుల్లో రూ.90.14కు చేరుకుంది.

Comments

comments

Related Stories: