చంద్రబాబు, లోకేష్‌పై హైకోర్టులో పిల్

రూ.25వేల కోట్ల అక్రమార్జన ఆరోపణ మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సి ఎం ఎన్.చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, పం చాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి నా రా లోకేష్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, వారిపై సిబిఐ, ఇడి (ఎన్‌ఫోర్ట్‌మెంట్) దర్యాప్తునకు ఆదేశించాలని కోరు తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కాగితాలకే పరిమితం అయిన కంపెనీలకు అత్యంత ఖరీదైన వేల ఎకరాల భూములు కేటాయించి రూ.25 వేల కోట్ల ను నారా లోకేష్ కూడబెట్టారంటూ రిటైర్డు న్యా యాధికారి, ముందడుగు […]

రూ.25వేల కోట్ల అక్రమార్జన ఆరోపణ

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సి ఎం ఎన్.చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, పం చాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి నా రా లోకేష్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, వారిపై సిబిఐ, ఇడి (ఎన్‌ఫోర్ట్‌మెంట్) దర్యాప్తునకు ఆదేశించాలని కోరు తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కాగితాలకే పరిమితం అయిన కంపెనీలకు అత్యంత ఖరీదైన వేల ఎకరాల భూములు కేటాయించి రూ.25 వేల కోట్ల ను నారా లోకేష్ కూడబెట్టారంటూ రిటైర్డు న్యా యాధికారి, ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షులు జె.శ్రవణ్‌కుమార్ పిల్ దాఖలు చేశారు. ఈ బాగోతానికి అధికారికంగా సిఎం చంద్రబాబు, తెరవెనుక కీలకపాత్రధారిగా ఎపి నాన్ రెసిడెంట్ తెలు గు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) సిఇఒ వేమూరి రవికుమార్ ఉన్నారని పిల్‌లో ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, రవికుమార్ కలిసి దురుద్దేశంతోనే ఐటి పాలసీని రూపొందించి ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేశారని ఆరోపించారు. ఏపీఎన్‌ఆర్‌టీ ద్వారా వచ్చిన ఫైళ్లను సత్వరమే క్లియర్ అయ్యేలా చట్టంలో మార్పులు చేసి ఎన్నో కంపెనీలను ఆకర్షించేలా చేసి మోసానికి తెర తీశారన్నారు. విశాఖలో ఎకరం రూ.15 కోట్ల విలువైన భూమిని రూ.3.5లక్షలకు కట్టబెట్టారని, ఇలా రూ.500 కోట్ల విలువైన 40 ఎకరాల్ని ఫ్రాంక్లిన్ టెంపులటన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఇన్నోవా సొల్యూషన్స్‌కు ధారాదత్తం చేశారని, ఇంత ఖరీదైన భూమి ఇచ్చేందుకు విధించిన షరతులు విస్తుపోయేలా ఉన్నాయని పిల్‌లో పేర్కొన్నారు. రెండున్నర వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ కంపెనీపై ప్రభుత్వ అజమాయిషీ ఏమీ ఉండదని, భూమిని అమ్ముకునేందుకు ఆ కంపెనీకి అధికారం వచ్చేస్తుందని ఆరోపించారు. టిడిపి నాయకుడికి చెందిన వీబీసీ ఫెర్టిలైజర్స్ కంపెనీకి రూ.100 కోట్ల విలువైన భూమి ఇచ్చేశారని పేర్కొన్నారు. ఏపీఐఐసీ 57, 836 ఎకరాలకు వివిధ కంపెనీలకు ఇచ్చేసిందని, అలా ఏ కంపెనీకి ఎంత భూమి ఇచ్చారో వివరాలు సమాచార హక్కు చట్టం కింది కోరినా ఇవ్వడం లేదన్నారు.
లోకేష్ మంత్రి అయ్యాక..
లోకేష్ ఎమ్మెల్సీ అయ్యాక చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. వెంటనే ప్రవాసభారతీయుడు వేమూరి రవికుమార్‌ను సలహాదారుడిగానే కాకుండా ఏపీఎన్‌ఆర్‌టీకి చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ కల్పన పేరుతో కాగితాలకే పరిమితమైన షెల్ కంపెనీలకు అత్యంత ఖరీదైన భూములు కేటాయించేశారు. ఉద్యోగ కల్పన చేశామని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. వాస్తవానికి వేలు కాదు కదా వందల్లో కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. వెబ్‌సైట్‌లో వివరాలేమీ లేకుండా అంతా గుట్టుగా ఉంచారు.
వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే ప్రభుత్వం మోసం చేసిందని తేలిపోతుంది. అధికారంలోకి వస్తే ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశారు. పాలనా పగ్గాలు అందుకున్నా కాగితాల కంపెనీలకు భూకేటాయింపులకు వీలుగా ఉన్న చట్టాల్ని మార్చేశారు. ఉద్యోగ కల్పన పేరుతో నారా లోకేష్, వేమూరి రవికుమార్‌లు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారు. ఏపీలో పెట్టుబడులకు రవికుమార్‌నే మధ్యవర్తిగా పెట్టుకుని ఈ దారుణాలకు తెరతీశారు. చంద్రబాబు, లోకేష్‌ల తరఫున రవికుమారే మాట్లాడుతున్నారు. మీకిది-నాకిది అనే తరహాలో క్విడ్‌ప్రోకో పద్ధతిలో అవినీతి కొనసాగుతోంది. ఈ బాగోతంపై సీబీఐ, ఈడీ దర్యాప్తులకు ఆదేశించాలి.. అని పిల్‌లో హైకోర్టును కోరారు. ఇందులో నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్, ఐటీ శాఖ మాజీ మంత్రి పల్లె రఘునాఎద్‌రెడ్డి, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) సీఈఓ వేమూరి రవికుమార్ లను వ్యక్తిగత ప్రతివాదుల్ని చేశారు.