నగర మెట్రో ప్రపంచంలోనే అత్యుత్తమం

మెట్రోరైల్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్   హబ్‌గా  : మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ సిటీ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మెట్రోల్లో నేను ప్రయాణించాను కాని ప్రపంచంలోనే అత్యుత్తమమైన మెట్రోల్లో హైదరాబాద్ ఒకటని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు. తాను ఏదీ కూడా ఒకరు చెబితే నమ్మనని, ఏదైనా ప్రత్యక్షంగా చూసాక నిర్ధారించుకుని దాని ఫలితం వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి సోమవారం అమీర్‌పేట్ నుంచి ఎల్‌బీనగర్ వరకు […]

మెట్రోరైల్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్   హబ్‌గా  : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మెట్రోల్లో నేను ప్రయాణించాను కాని ప్రపంచంలోనే అత్యుత్తమమైన మెట్రోల్లో హైదరాబాద్ ఒకటని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు. తాను ఏదీ కూడా ఒకరు చెబితే నమ్మనని, ఏదైనా ప్రత్యక్షంగా చూసాక నిర్ధారించుకుని దాని ఫలితం వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి సోమవారం అమీర్‌పేట్ నుంచి ఎల్‌బీనగర్ వరకు రెండో దశ మెట్రో రైల్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మట్లాడుతూ మెట్రో ద్వారా హైదరాబాద్ నగరాన్ని అత్యాధునిక, ప్రయాణికులకు పూర్తి అనుకూల నగరంగా ఈ ప్రాజెక్టు మార్చనుందన్నారు. మెట్రో రవాణా ద్వారా నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రయాణికుల సమయం కూడా ఆదా అవుంతున్నారు. ప్రపంచశ్రేణి సదుపాయాలను కలిగిన మెట్రోను హైదరాబాదీలు సంపూర్ణంగా వినియోగించకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రజా భాగస్వామ్యంతో నిర్వహిసున్న మెట్రో సేవల ద్వారా రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకోగలదని చెప్పారు.
భూసేకరణకు రూ.3వేల కోట్లు: కెటిఆర్
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మంచి టెక్నాలజీ, నాణ్యతతో రూ.14,132 కోట్లతో నిర్మిస్తున్న హైదరాబాద్ మెట్రోరైల్ భారతదేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ,ప్రయివేటు భాగస్వామ్య ప్రజా రవాణా సంస్థగా వెల్లడించారు. పూర్తిగా ఆధునిక టెక్నాలజీతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో రూ.1400 కోట్లు, ఎల్ అండ్ టీ సంస్థ రూ.1200 కోట్లు పెట్టుబడి అభివృద్ధి చేస్తుందన్నారు. 75 కి.మీ.ల ప్రతిపాధనతో మూడు కారిడార్ల మీదుగా గతేడాది మెట్రోను ప్రారంభించి అంచెలంచెలుగా నగరంలో పూర్తి స్థాయిలో మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే యోచనతో ఉన్నామన్నారు. అందుకోసం రూ3000 కోట్లు ప్రతిపాదించి భూసేకరణ కోసం ఖర్చుపెట్టామని తెలిపారు. అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్ రోజూ అతి రద్ధీగా ఉండే ఈ మార్గంలో మెట్రో ప్రారంభం వల్ల అచేక మంది ప్రయాణికులకు రవాణా సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని చెప్పారు. స్టేషన్లకు ఆటో, క్యాబ్, సొంత వాహనాల్లో వచ్చే ప్రాయాణికుల సౌలభ్యం కోసం హెచ్‌ఎంఆర్ సంస్థ ఆదునికత ఉట్టి పడేలా అన్ని రకాల సదుపాయాలను స్టేషన్లలో ఏర్పాటు చేసిందని, రాబోయే రోజుల్లో నగరం మెట్రో మల్టీపర్పస్ హబ్‌గా మారబోతుందని ఉద్ఘాటించారు. జూబ్లీహిల్స్ వద్ద అత్యున్నత ఆధునికత డిజైన్లతో స్టేషన్‌ను రూపొందించి, 5 పుట్‌పాత్‌లను నిర్మించామన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో ఈ రోజు అదనంగా మరో 16 కి.మీ.ల మార్గాన్ని ప్రారంభించడం ద్వారా నగర వాసుల కోసం ప్రపంచశ్రేణి మౌళిక సదుపాయాలను సృష్టించాలనే ప్రభుత్వ ప్రయత్నంలో మరో ప్రతిష్టాత్మక మైలురాయిని చేరుకున్నామని వివరించారు.
ప్రపంచ స్థాయిలో నగర మెట్రో : ఎన్‌విఎస్‌రెడ్డి
హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ డిల్లీ తర్వాత దేశంలో అతిపెద్ద మెట్రోనెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో నిలిచిందన్నారు. పీపీపీ విధానంతో నిర్మితమైన ఈ మెట్రో ద్వారా విస్తృతమైన ప్రజా రవాణా వ్యవస్థను అందిస్తూ, దేశంలోనే గ్రీన్ సిటీగా మలిచి,హైదరాబాద్‌ను ప్రంపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ.ఎన్వీఎస్‌రెడ్డి,ఐఆర్‌ఎస్,ఎల్‌ఆండ్‌టీ హెచ్‌ఎంఆర్ సీఈఓ కెవీబీరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, నాయిని నర్సింహ్మారెడ్డి,మల్కాజిగిరి ఎం.పీ.మల్లారెడ్డి, నగర మేయర్ బొంతురామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.