‘పల్లె ప్రగతి’కి ప్రత్యేక శిక్షణ

 స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి పంచాయతీ  స్థాయిలో ప్రారంభం మన పాలక వర్గాలు లేకపోవడంతో ప్రభుత్వం పల్లె ప్రగతి కోసం అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. గ్రామస్థాయి నుంచి పనిచేసే అధికారులు, ఉద్యోగులకు గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయడంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారు. వీరు వారి జిల్లాల్లో గ్రామ స్థాయిలో పనిచేసే ఇతర గ్రామీణాభివృద్ధి […]

 స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి

పంచాయతీ  స్థాయిలో ప్రారంభం

మన పాలక వర్గాలు లేకపోవడంతో ప్రభుత్వం పల్లె ప్రగతి కోసం అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. గ్రామస్థాయి నుంచి పనిచేసే అధికారులు, ఉద్యోగులకు గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయడంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారు. వీరు వారి జిల్లాల్లో గ్రామ స్థాయిలో పనిచేసే ఇతర గ్రామీణాభివృద్ధి అధికారులకు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు.  ‘పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం’ పేరుతో పంచాయతీ స్థాయి వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులను నిర్ణయించడం, నిధులను వెచ్చించడం అధికారుల బాధ్యత కావడంతో వారికి శిక్షణ అవసరమన్న భావనతో పాటు పాలక వర్గాలు ఏర్పడిన అనంతరం కూడా పర్యవేక్షణ బాధ్యత కూడా ఉంటుం ది కాబట్టి ఈ శిక్షణ అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత రాష్ట్ర స్థాయలో మూడు విడతలుగా మే నెల 11నుంచి శిక్షణ ఇచ్చారు.  రా ష్ట్రంలోని 30 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి మూడు విడతల్లో  శిక్షణను హైదరాబాద్‌లోని టిఎస్‌ఐఆర్‌డిలో ఇచ్చారు. తొలివిడతలో ఆ దిలాబాద్, నిర్మల్ , మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారికి ఇచ్చారు. రెండవ విడతలో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు, మూడవ విడతలో  వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల వారికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు ప్రతి జిల్లా నుంచి ఆయా జిల్లాల డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్‌తో పాటు చురుకైన, సమర్థులైన నలుగురు ఆపరేటర్లు హాజరయ్యారు. వీరికి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఏజెన్సీల నమోదు, వచ్చే నిధులు, ఖర్చు, నిధుల బదిలీ, అడ్వాన్స్‌లు, యు టిలైజేషన్ సర్టిఫికెట్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. వీరు వారి జిల్లాల్లో ఇఒఆర్‌డి, పంచాయతీకార్యదర్శులకు శిక్షణ ఇస్తారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో అత్యవసర పరిస్థితులతో పాటు కొన్ని సంధర్భాలలో నిధుల కేటాయింపు అధికారం సర్పంచ్‌లకు కట్టబెట్టింది. అభివృద్ధి పనులను నిర్ణయించడం, వాటికి నిధులను కేటాయించుకోవడం కూడా పంచాయతీస్థాయికే కట్టబెట్టారు. ఇప్పటి నుంచి కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా పంచాయతీలకు నిధులను ఇవ్వనుంది. దీంతో నిధుల వినియోగం, వాటి మళ్లింపుల విషయంలో  దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ శిక్షణ ఇస్తున్నట్లు పంచాయతీరాజ్ అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యేకించి కేంద్రం నుంచి వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే వెలుతున్నందున గ్రామ స్థాయిలో అవి అవసరమైన పనులకే ఉపయోగపడేలా చూడడం, గ్రామీణ స్థాయిలో ఏయే పనులు చేయాలి, వాటికి ఎన్ని నిధులు కేటాయించాలి, వాటిలో దుర్వినియోగాన్ని ఎలా నివారించాలి, అవసరాన్ని బట్టి నిధులను ఎలా మల్లించాలి అన్న అంశాలపై శిక్షణలో వివరించారు. ముందుగా రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన కొందరికి శిక్షణ పూర్తి చేశారు. వీరితో పంచాయతీల స్థాయిలో మిగిలిన ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆమేరకు ఇవ్వ డం మొదలుపెట్టారు.

Related Stories: