మెట్రో దౌడ్ సైకిల్ రైడ్

 అమీర్‌పేట్ టు ఎల్‌బినగర్ మెట్రో రైలుకు పచ్చజెండా ఊపిన గవర్నర్ నరసింహన్  పాల్గొన్న మంత్రులు కెటిఆర్, నాయిని, తలసాని తదితరులు  16 కి.మీ. దూరం సాగిన నూతనయానం  ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వరకు గవర్నర్, కెటిఆర్ సైకిల్ రైడ్ మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: హైదరాబాద్  మెట్రో రైలు సోమవారం నాడు అమీర్‌పేట, ఎల్‌బినగర్‌ల మధ్య తొలిసారిగా దౌడు తీసింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ సరిగ్గా పగలు 12గంటలకు ఈ రూట్లో మెట్రోకు పచ్చజెండా ఊపారు. మంత్రులు కెటిఆర్, […]

 అమీర్‌పేట్ టు ఎల్‌బినగర్ మెట్రో రైలుకు పచ్చజెండా ఊపిన గవర్నర్ నరసింహన్
 పాల్గొన్న మంత్రులు కెటిఆర్, నాయిని, తలసాని తదితరులు
 16 కి.మీ. దూరం సాగిన నూతనయానం
 ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వరకు గవర్నర్, కెటిఆర్ సైకిల్ రైడ్

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: హైదరాబాద్  మెట్రో రైలు సోమవారం నాడు అమీర్‌పేట, ఎల్‌బినగర్‌ల మధ్య తొలిసారిగా దౌడు తీసింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ సరిగ్గా పగలు 12గంటలకు ఈ రూట్లో మెట్రోకు పచ్చజెండా ఊపారు. మంత్రులు కెటిఆర్, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ మున్నగువారు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ నరసింహన్ ఐటీ మంత్రి కెటిఆర్‌తో కలిసి స్మార్ట్ సైకిల్ తొక్కారు. ఈ సైకిల్ ప్రయాణం ఖైరతాబాద్ నుంచి రాజ్ భవన్ వరకు కొనసాగింది. ఎల్‌బినగర్ నుంచి మెట్రో రైలులో ఖైరతాబాద్‌కు చేరుకున్న గవర్నర్, మంత్రులు అందరిని ఆశ్చర్యపరుస్తూ స్టేషన్ వద్ద అందుబాటులో ఉన్న సైకిళ్ల వద్దకు చేరుకుని వాటిపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారికి ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. వీరితో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ కూడా సైకిల్‌పై రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్ వరకు రెండో దశ మెట్రోత రైల్ పచ్చజెండా ఊపిన గవర్నర్, మంత్రి కేటీఆర్ ముందుగా స్టేషన్‌లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వసతులు, అక్క డ నెలకొల్పిన స్టాల్స్, మాల్స్‌ను పరిశీలించారు. అనతంరం గవర్నర్ నరసింహన్ మంత్రులు ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోం శాఖా మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, పశు సంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ మంత్రి పద్మారావు, మల్కాజిగిరి ఎం.పీ. మల్లారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.ఎస్.కె.జోషి, పురపాలక వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య దర్శి అరవింద్‌కుమార్, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎం.డీ. ఎస్‌వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ సీఈఓ కెవీబీరెడ్డి, ఇతర ఉన్నతా ధికారులతో కలిసి అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్ వరకు 16 కి.మీ.లు మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఈ మార్గంలో ఉన్న పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, గాంధీభవన్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఎంజీ బీఎస్, మలక్‌పేట, న్యూమార్కెట్, ముసారంబాగ్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, విక్టోరియామెమోరియల్, ఎల్‌బీనగర్ వరకు ఉన్న 16 మెట్రో స్టేషన్లను రైల్లోనుంచి గమనిస్తూ ప్రయాణం సాగించారు. మెట్రోరైలులో అత్యాధునిక సాంకేతికతతో పాటు కారిడార్ల నిర్మాణం గురించి ఎల్ అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ సంస్థ ప్రతిని ధులు, మంత్రి కేటీఆర్‌తో చర్చిస్తూ ప్రయాణం సాగిం చారు. అయితే మధ్యలో ఎంజీబీఎస్ స్టేషన్ వద్దకు రాగాను రైలు ఆపించి అక్కడ దిగారు. మంత్రులు, అధికారులతో కలిసి ఎంజీ బీఎస్ స్టేషన్‌లో చేపట్టిన ఏర్పాట్లను వీక్షీంచి, పరిసరా లను పరిశీలించారు. అనంతరం ఎల్‌బీనగర్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన మెట్రో ప్రాజెక్టు ఫొటో ప్రదర్శనతో పాటు ప్రొజెక్టర్‌ను తిలకించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన అనంతరం గవర్నర్ అదే రైలులో తిరుగు ప్రయా ణం అయ్యారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు రాగానే అక్కడే గవర్నర్ నరసింహన్ దిగి సమీపంలోని రాజ్ భవన్‌కు ప్రత్యేక వాహనంలో వెళ్లిపోయారు. నగరంలో హెచ్ ఎంఆర్ నిర్వహి స్తున్న మెట్రో సేవల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.

Related Stories: