లావెర్ కప్ యూరప్ జట్టుదే

ప్రేగ్‌లో గత ఏడాది గెలుచుకున్న కప్‌ను డిఫెండ్ చేసుకుంది కెవిన్ ఆండర్సన్‌ను ఓడించి జ్వెరేవ్ యూరప్ జట్టును గెలిపించాడు షికాగో: గత ఏడాది ప్రేగ్‌లో గెలుచుకున్న లావెర్ కప్‌ను యూరప్ జట్టు ఈ ఏడాది కూడా నిలుపుకుంది. అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆదివారం కేవిన్ ఆండర్సన్‌ను 138తో వరల్డ్ టీమ్‌ను ఓడించడంతో కప్ ఈసారి కూడా యూరప్ జట్టు కైవసమైంది. జర్మనీ కి చెందిన జ్వెరేవ్ 67(3/7), 75, 107తో ఆండర్సన్‌ను ఓడించి టైటిల్‌ను డిఫెండ్ చేశాడు. తొలి […]

ప్రేగ్‌లో గత ఏడాది గెలుచుకున్న కప్‌ను డిఫెండ్ చేసుకుంది
కెవిన్ ఆండర్సన్‌ను ఓడించి జ్వెరేవ్ యూరప్ జట్టును గెలిపించాడు

షికాగో: గత ఏడాది ప్రేగ్‌లో గెలుచుకున్న లావెర్ కప్‌ను యూరప్ జట్టు ఈ ఏడాది కూడా నిలుపుకుంది. అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆదివారం కేవిన్ ఆండర్సన్‌ను 138తో వరల్డ్ టీమ్‌ను ఓడించడంతో కప్ ఈసారి కూడా యూరప్ జట్టు కైవసమైంది. జర్మనీ కి చెందిన జ్వెరేవ్ 67(3/7), 75, 107తో ఆండర్సన్‌ను ఓడించి టైటిల్‌ను డిఫెండ్ చేశాడు. తొలి రబ్బర్‌లో వరల్డ్ టీమ్ బాగా ఆడింది. అమెరికా జోడి జాన్ ఇస్నర్, జాక్ సాక్ డబుల్స్‌లో జ్వెరేవ్, ప్రపంచ నెం.1 రోజర్ ఫెదరర్‌ను రెండు మ్యాచ్ పాయింట్లతో ఓడించింది. ఇస్నర్, సాక్ 46, 76(7/2), 11/9తో ఇంకా మూడు సింగిల్స్ రబ్బర్స్ మిగిలి ఉండగానే వరల్డ్ టీమ్‌కు 87 స్కోరు ఆధిక్యాన్ని ఇచ్చారు. తొలిరోజు కంగుతిన్న యూరప్ జట్టు తర్వాత సూపర్బ్‌గా ప్రతిస్పందిం చింది. 37 ఏళ్ల ఫెదరర్ తొలి సింగిల్స్ మ్యాచ్‌లో మూడు కీలక పాయింట్లు సాధిం చాడు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెదరర్ సెట్ ఓడిపోయాక ఇస్నార్‌ను దెబ్బతీశాడు. 67(5/7), 76(8/6),10/7 స్కోరుతో ఇస్నర్‌పై గెలుపు సాధించాడు. ఈ గెలుపు ఫెదరర్ శారీరక పటుత్వాన్ని చాటింది. 20వ సారి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ చాంపి యన్ గెలుచుకున్న ఫెదరర్ గంటలోపే ఇస్నర్‌ను ఓడించాడు. తన గెలుపును ఫెదరర్ కోర్టులోనే పుషప్స్ ద్వారా ప్రేక్షకులకు వేడుక చేశాడు. కాగా యూరప్ జట్టు కెప్టెన్ జార్న్ బోర్గ్ వరల్డ్ టీమ్ ఆటతీరును కొనియాడాడు. వరల్డ్ టీమ్‌కు ఆయన  ప్రత్యర్థి జాన్ మెకెన్రో సారథ్యం వహించాడు. ‘నా జట్టు ఆటతీరుకు నేను గర్విస్తున్నాను. జాన్ మెకెన్రో కెప్టెన్సీలో వరల్డ్ టీమ్‌ను ఓడించడం చాలా కష్టమని మాకు తెలుసు. అతడి జట్టు గొప్పది. అంతేకాక వారు చాలా ప్రొఫెషన్లు’ అని బోర్గ్ చెప్పాడు. ఆస్ట్రేలి యా దిగ్గజం రాడ్ లావెర్ పేరిట నిర్వహించే లావెర్ కప్ తదుపరి 2019 సెప్టెంబర్ లో జెనీవాలో జరగనున్నది.

Related Stories: