రెజ్లింగ్‌లో దీపక్ పునియాకు రజత పతకం

భారత్‌కు ఆరు పతకాలు ట్రెనావా(స్లోవేకియా): జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కొద్దిలో స్వర్ణ పతకం చేజారింది. 86 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్‌లో భారత్‌కు చెందిన దీపక్ పునియా ఆదివారం టర్కీకి చెందిన ఆరిప్ ఓజెన్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ ఏడాది మొదలులో జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం గెలిచిన దీపక్ 12 తేడాతో ఓజెన్ చేతిలో ఓడాడు. కేవలం మూడు సెకండ్లలో ఆట ముగుస్తుందనగా కేవలం ఒక్క పాయింటే స్కోరు చేశాడు. […]

భారత్‌కు ఆరు పతకాలు


ట్రెనావా(స్లోవేకియా): జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కొద్దిలో స్వర్ణ పతకం చేజారింది. 86 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్‌లో భారత్‌కు చెందిన దీపక్ పునియా ఆదివారం టర్కీకి చెందిన ఆరిప్ ఓజెన్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ ఏడాది మొదలులో జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం గెలిచిన దీపక్ 12 తేడాతో ఓజెన్ చేతిలో ఓడాడు. కేవలం మూడు సెకండ్లలో ఆట ముగుస్తుందనగా కేవలం ఒక్క పాయింటే స్కోరు చేశాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆరు పతకాలు లభించాయి. అందులో మూడు రజతం, మూడు కాంస్య పతకాలు. గ్రెకో రోజమన్ గ్రాప్లర్స్‌లో మూడు పతకాలు దకాయి. కాగా మహిళలు రెండు కాంస్య పతకాలు గెలిచారు. సచిన్ రాఠి నుంచి చాలా ఆశించినప్పటికీ 74 కిలోల కాంస్య పతకం మ్యాచ్‌లో అతడు ఓడిపోయాడు. కెనడాకు చెందిన డేవిడ్ బెతనోవ్ చేతిలో సాంకేతిక సుపీరియారిటీ కారణంగా ఓడిపోయాడు. 92 కిలోల సంజీత్ మెడల్ రౌండ్‌లోకి చేరలేకపోయాడు. తన రెపెచేజ్ రౌండ్‌లో ఇర్హాన్ యయలాసీ చేతిలో 67 తేడాతో ఓడిపోయాడు. గ్రెకో రోమన్‌లో విజయ్(60 కిలోలు), సాజన్(77 కిలోలు) రజతపతకాలు గెలిచారు. కాగా విజయ్ 55 కిలోల కుస్తీలో కాంస్యం కూడా గెలుచుకున్నాడు.

Related Stories: