టి20 సిరీస్ భారత మహిళల జట్టు కైవసం

కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదు టి20ల సిరీస్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే చేజిక్‌కించుకుంది. సోమవారం జరిగిన నాల్గో టి20లో భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సాధించారు. శ్రీలంక నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు మిథాలీ రాజ్(11), స్మృతీ మంధాన(5)లు విఫలమైనప్పటికీ, జెమిమా రోడ్రిగ్స్(52 నాటౌట్;37 బంతుల్లో […]


కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదు టి20ల సిరీస్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే చేజిక్‌కించుకుంది. సోమవారం జరిగిన నాల్గో టి20లో భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సాధించారు. శ్రీలంక నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు మిథాలీ రాజ్(11), స్మృతీ మంధాన(5)లు విఫలమైనప్పటికీ, జెమిమా రోడ్రిగ్స్(52 నాటౌట్;37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అనుజా పాటిల్(54 నాటౌట్; 42 బంతుల్లో 7ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రోడ్రిగ్స్ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించారు. ఈ జోడి అజేయంగా 96 పరుగులు జోడించడంతో భారత్ 15.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టి20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రపు ఐదో టి20 మంగళవారం జరుగనుంది.