మరోసారి కుప్పకూలాయి

500 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ ఏడు నెలల్లో ఇదే ఒక రోజు అతిపెద్ద పతనం బ్యాంకింగ్, ఆటో స్టాక్స్‌లో వెల్లువెత్తిన అమ్మకాలు న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు గతకొద్ది రోజులుగా నష్టాలతో ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం కూడా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా నష్టపోయి, ఏడు నెలల్లో ఒక రోజు అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో క్షీణత, ద్రవ్యలభ్యత ఆందోళనల నేపథ్యంలో బ్యాంకింగ్,ఆటో స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. […]

500 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్
ఏడు నెలల్లో ఇదే ఒక రోజు అతిపెద్ద పతనం
బ్యాంకింగ్, ఆటో స్టాక్స్‌లో వెల్లువెత్తిన అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు గతకొద్ది రోజులుగా నష్టాలతో ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం కూడా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా నష్టపోయి, ఏడు నెలల్లో ఒక రోజు అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో క్షీణత, ద్రవ్యలభ్యత ఆందోళనల నేపథ్యంలో బ్యాంకింగ్,ఆటో స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 536 పాయింట్లు (1.46 శాతం) పడిపోయి 36,305 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో వరసగా ఐదో రోజూ సూచీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా – చైనా దేశాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల,డాలర మారకంలో రూపాయి విలువ బలహీనపడటం వంటివి మార్కెట్లకు ప్రతికూలం గా మారాయి. ఇంకా దేశీయ మార్కెట్‌లో ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) రుణ సంక్షోభం, స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి తరలిపోతున్న ఎఫ్‌ఐఐ(విదేశీ ఇన్వెస్టర్లు)ల పెట్టుబడులు సూచీలు పతనానికి కారణయ్యాయి. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు ఆగలేదు.నిఫ్టీ 177పాయింట్లు నష్టపోయి 10,967 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంకు సూచీ 671 పాయింట్లు (2.62 శాతం) నష్టపోయి 24,925 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇలో ఒక్క ఐటి రంగాలకు చెంది న సూచీ తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టీ రియల్టీ 5.50 శాతానికి పైగా నష్టపోయింది. ప్రధానంగా బజాజ్‌ఫైనాన్స్ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి, ఎం అండ్ ఎం,ఐషర్ మోటర్స్, ఇండియాబుల్స్‌ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్‌మహీంద్రా,ఇన్ఫోసిస్, కోల్ ఇండి యా, టిసిఎస్ షేర్లు 1.50శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి. ఈ ఐదు రోజుల్లో సెన్సెక్స్ సూచి 1,785 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 540 పాయింట్లను నష్టపోయింది. తమ జీవితకాల గరిష్టస్థాయి నుంచి సెన్సెక్స్ సూచీ 6.40 శాతం, నిఫ్టీ 6 శాతం నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ సూచి కూడా జీవితకాల గరిష్టస్థాయి నుంచి 11శాతం పతనమైంది.
కోలుకున్న డిహెచ్‌ఎఫ్‌ఎల్
గతవారం ఆఖరి రోజు మార్కెట్లో డిహెచ్‌ఎఫ్‌ఎల్ (దివాన్ హౌసింగ్ పైనాన్స్ లిమిటెడ్) అనూహ్యంగా 42 శాతం పతనమైంది. అయితే సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు రికవరీ బాట పట్టింది. లిక్విడిటీ సంక్షోభం, రుణ చెల్లింపుల్లో విఫలమవ్వడం, నిధుల కొరత ఎదుర్కోంటుందనే వార్తలతో గతవారం ఈ షేరు భారీగా నష్టపోయింది.డిహెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీ ఎలాంటి రుణ చెల్లింపుల్లో విఫలం కాలేదని, కంపెనీ ఫండమెంటల్స్ బల ంగా ఉన్నాయని కంపెనీ సిఎండి కపిల్ వాధ్వాన్ ఇన్వెస్టర్లకు స్పష్టం చేశారు. దీంతో డిహెచ్‌ఎఫ్‌ఎల్ రూ. 386. 70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించి ఇంట్రాడేలో25 శాతం ర్యాలీ చేసింది.ఆఖరికి12 శాతం జంప్‌చేసి రూ. 392.15 వద్ద ముగిసింది.

జైట్లీ భరోసా ఇచ్చినా..

బ్యాంకుల్లో మొండి బకాయిల కారణంగా ఫైనాన్షియల్ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లకు అదనపు ద్రవ్యలభ్యత దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. మార్కెట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో అవసరమైతే చర్యలు చేపడతామని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ భరోసా ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని ట్విట్టర్ ద్వారా జైట్లీ చెప్పారు. అయినప్పటికీ సోమవారం మార్కెట్ల పతనానికి బ్రేక్ పడలేదు. ఫైనాన్షియల్ మార్కెట్లను అతి దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని ఆర్‌బిఐ, సెబీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. ఇవేమీ మార్కెట్ పతనాన్ని ఆపలేకపోయాయి. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎల్ అనే ఫైనాన్స్ సంస్థలో సంక్షోభం తర్వాత భారత బ్యాంకింగ్ రంగం నగదు కొరత సమస్యను ఎదుర్కొంటోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఐదు రోజుల్లో రూ.8.5 లక్షల కోట్లు ఆవిరి

గత వారం నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్ దాదాపు 5 శాతం పతనమైంది. ఐదు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.8.47 లక్షల కోట్లు ఆవిరైంది. 30 షేర్ల బిఎస్‌ఇ సూచీ సోమవారం 536 పాయింట్లు అంటే 1.46 శాతం పతనమైంది. ఈ కారణంగా బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మొత్తంగా రూ. 1,47,89,045 కోట్లు ఉండగా, దీనిలో రూ.8,47,974 కోట్లు ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. నగదు కోరత ఆందోళనలు, అమెరికాతో వాణిజ్య చర్చలను చైనా రద్దు చేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు భేర్‌మన్నాయి. గతవారం కూడా మార్కెట్ల పతనం ఇన్వెస్టర్లు భారీ నష్టాలను మిగిల్చింది.

Related Stories: