టికెట్ల దుమారం

ఆశావహులకు స్థానం కల్పించని అధిష్ఠానం తిరుగుబావుటా ఎగురవేస్తున్న అసమ్మతి నేతలు జాబితావిడుదల కాకముందే గ్రామాల్లో ప్రచారం రచ్చకెక్కిన గ్రూపు విభేదాలు మన తెలంగాణ/మంచిర్యాల: కాంగ్రెస్‌లో టికెట్ల దుమారం చెలరేగుతోంది. గత కొంత కాలంగా పార్టీలో ఉంటూ టికెట్‌లు ఆశించిన వారికి స్థానం దక్కకపోవడంతో వారు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ప్రజల్లో విశ్వాసం ఉన్న వారికి టికెట్‌లు కేటాయించకుండా స్థానికేతరులకు టికెట్‌లు కేటాయించడంతో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మళ్లీ కాంగ్రెస్‌లో గ్రూపు […]

ఆశావహులకు స్థానం కల్పించని అధిష్ఠానం
తిరుగుబావుటా ఎగురవేస్తున్న అసమ్మతి నేతలు
జాబితావిడుదల కాకముందే గ్రామాల్లో ప్రచారం
రచ్చకెక్కిన గ్రూపు విభేదాలు

మన తెలంగాణ/మంచిర్యాల: కాంగ్రెస్‌లో టికెట్ల దుమారం చెలరేగుతోంది. గత కొంత కాలంగా పార్టీలో ఉంటూ టికెట్‌లు ఆశించిన వారికి స్థానం దక్కకపోవడంతో వారు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ప్రజల్లో విశ్వాసం ఉన్న వారికి టికెట్‌లు కేటాయించకుండా స్థానికేతరులకు టికెట్‌లు కేటాయించడంతో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మళ్లీ కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు రాజుకుంటున్నాయి. గెలిచే స్థానాలను సైతం ఇతరులకు కేటాయించడంతో స్థానికంగా అసంతృప్తి నెలకొంది. మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జల్లాల్లో కాంగ్రెస్ అధిష్టానం టికెట్‌లను ఖరారు చేయకముందే ఎవరికి వారే టికెట్ వచ్చిందంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో మాజీ ఎంఎల్‌సి ప్రేమ్‌సాగర్‌రావుకు స్థానం లభించగా టికెట్ కూడా ఖరా రు అయిందంటూ ప్రచారంతో పాటు చీరల పంపిణీ కొనసాగిస్తున్నారు.

మంచిర్యాల నియోజకవర్గం నుంచి మాజీ ఎంఎల్‌ఏ గడ్డం అరవిందరెడ్డి ఇప్పటికి కూడా తనకే సీటు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుండగా మాజీ ఎంఎల్‌సి ప్రేమ్‌సాగర్‌రావు అధిష్టానం తనకే టికెట్‌ను కేటాయించిందని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అదే విధంగా చెన్నూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బోడ జనార్థన్ టికెట్‌పై ఆశ పెట్టుకొని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత రెండు నెలలుగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం చివరి క్షణంలో నేతకాని కులానికి చెందిన వెంకటేష్‌నేతకు టికెట్ ఖరారు చేసిందని ఆయనే ప్రకటించుకుంటూ చెన్నూర్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి, రాజీనామా చేసిన వెంకటేష్ నేతకు కాంగ్రెస్ అధిష్టానం అండదండలు ఉండడంతో దాదాపు టికెట్ ఖరారు అయి న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బోడ జనార్థన్ పరిస్థితి ఊహించని విధంగా మారింది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ టికెట్ తనకే కేటాయిస్తారని ఆశలు పెట్టుకోగా అడియాశలు కావడంతో వేరే గూటి కోసం వెతుకుతున్నారు.

వెంకటేష్‌నేత స్థానికేతరుడు కావడంతో టిఆర్‌ఎస్ తరుపున బరిలో ఉన్న పెద్దపల్లి ఎంపి బాల్కసుమన్‌కు గట్టిపోటి ఇచ్చే అవకాశం లేకపోవడంతో మాజీ మంత్రి బోడ జనార్థన్ మరోసారి టికెట్ కోసం అధిష్టాన వర్గాన్ని కలిసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు అధిష్టానం ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయకపోయినప్పటికీ ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందనే ధీమాతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అదే విధంగా బెల్లంపల్లి నియోజకర్గంలో కాంగ్రెస్ తరుపున చిలుముల శంకర్, మాజీమున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబులు పోటీ పడుతుండగా ఎవరికి వారే టికెట్ వస్తుందని ధీమాలో ఉన్నారు. ఆసిఫాబాద్‌లో మాత్రం పోటీ లేకపోవడంతో మాజీ ఎంఎల్‌ఏ ఆత్రం సక్కుకు టికెట్ ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా టికెట్‌లపై ఆశలు పెట్టుకొని ఉన్న నాయకులకు టికెట్‌లు దక్కని పక్షంలో తిరుగుబావుటా ఎగురవేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను త్వరిత గతిన ప్రకటించాల్సిన అవసరం ఎంతైన ఉందని పలువురు భావిస్తున్నారు. లేని పక్షంలో ఎవరికి వారే టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకోగా కొందరు నేతలు అసంతృప్తి చెంది ఇతర పార్టీల్లో చేరే అవకాశాలు కనిపిస్తుండగా ఇప్పటికే కాంగ్రెస్‌లో గ్రూపు విబేధాలు రచ్చకెక్కాయి.

Comments

comments

Related Stories: